iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. పాఠ‌శాల‌లు తెరిచిన రోజే అవన్నీ..

Good News for Students: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు విద్య,వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నారు.

Good News for Students: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు విద్య,వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నారు.

విద్యార్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. పాఠ‌శాల‌లు తెరిచిన రోజే అవన్నీ..

గత ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పదేళ్ల పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ని పక్కకు నెట్టి కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీపై ప్రజలకు నమ్మకాన్ని ఉంచి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. త్వరలో మహాలక్ష్మి స్కీమ్ కింద అర్హులైన ప్రతి మహిళకు రూ.2500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంగన్ వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం ప్రతిపాదించినట్లు విద్య, వ్యవసాయ రంగాలకు విద్యా కమీషన్, వ్యవసాయ కమీషన్ ఏర్పాలు చేస్తుందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క తో పాటు ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యా వేత్లు హరగోపాల్, కోదండ రామ్ తదితరులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సమావేశం సందర్బంగా విద్యావేత్తలు విద్యా రంగంలోని పలు సమస్యలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

విద్యా రంగం మరింత బలోపేతం అవ్వాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశాలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత స్వయం సహాయ సంఘాల మహిళలకు అప్పగించాలని, అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చాలని చెప్పారు. ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆ అంశాలు పరిశీలిస్తున్నామని అన్నారు. అలాగు 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, సంవత్సరానికి రెండు సార్లు టెట్ నిర్వాహణ, పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందజేస్తామని ఇతర మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి