SNP
SNP
ప్రజా గాయకుడు గద్దర్ గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సూర్యం వెల్లడించారు. ఇటీవల ఆయన అపోలో ఆస్పత్రిలో గద్దర్ గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యులు, కుటుంబసభ్యులు సైతం ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆయన హఠాత్తుగా మరణించారు. కాగా, ఆయన మృతికి బీపీ పెరగడం, షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం మల్లిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కాగా ఆయన పార్థీవ దేహాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. అక్కడే ఆయన అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గద్దర్ కుటుంబసభ్యులను కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్, ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.
ప్రజా గాయకుడిగా, రచయితగా, యుద్ధనౌకగా అందరికీ సుపరిచితమైన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాబ్ జిల్లాలో జరిగింది. ఇంజనీరింగ్ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు.
గద్దర్‌పై కాల్పులు..!
1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఆ తర్వాత 1997 ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుంచి బయటపడిన తర్వాత.. విప్లవ సాహిత్యాన్ని ప్రజలకు అందించారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవర రావులను తమ తరపున పంపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దర్ పాత్ర ఎంతో ఉంది. ఆయన రాసి, పాడిన ‘పొడుస్తున్న పొద్దు’ అనే పాట యావత్ తెలంగాణను చైతన్యం చేసింది.