iDreamPost
android-app
ios-app

మీరు నిజమైన లీడర్ సర్!.. KTRకు ఓదార్పుగా అనసూయ ట్వీట్

  • Published Dec 03, 2023 | 7:32 PM Updated Updated Dec 03, 2023 | 7:32 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. ఓటమిని అంగీకరిస్తూ కేసీఆర్ తన రాజీనామాను గవర్నర్ కు పంపించారు. కాగా ఓటమిపై స్పందించిన కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై నటి అనసూయ స్పందించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. ఓటమిని అంగీకరిస్తూ కేసీఆర్ తన రాజీనామాను గవర్నర్ కు పంపించారు. కాగా ఓటమిపై స్పందించిన కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై నటి అనసూయ స్పందించింది.

  • Published Dec 03, 2023 | 7:32 PMUpdated Dec 03, 2023 | 7:32 PM
మీరు నిజమైన లీడర్ సర్!.. KTRకు ఓదార్పుగా అనసూయ ట్వీట్

మూడోసారి విజయం సాధించి అధికారం చేపట్టాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరాజయం ఎదురైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక ఓటమిని అంగీకరిస్తూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఆ పోస్టులో.. రెండు సార్లు బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి, అధికారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలకు రుణపడి ఉన్నాను. ఈ రోజు ఫలితాలను చూస్తుంటే బాధగా లేదు.. నిరాశగా ఉంది. ఇంత దారుణమైన నెంబర్లను మేము ఊహించలేదు. దీన్నుంచి మేము నేర్చుకుంటాము.. తప్పుల్ని సరిదిద్దుకుంటాము. కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు అంటూ రాసుకొచ్చారు. ఇక కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై అనసూయ స్పందించారు. దీనికి సంబంధించిన పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే అనసూయ ఏ పోస్టు పెట్టినా సరే క్షణాల్లో వైరల్ గా మారుతుంటుంది. ఈ క్రమంలో కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఆమె ఓదార్పునిచ్చేలా ట్వీట్ చేసింది. ‘ మీరు నిజమైన లీడర్ సర్.. ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు.. బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తూ.. హైదరాబాద్ తో మళ్లీ మళ్లీ ప్రేమలో పడేటట్లు చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేటీఆర్ కు ఓదార్పుగా అనసూయ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయకు మొదటి నుంచి కేసీఆర్, కేటీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం అన్న విషయం తెలిసిందే.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahisabi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom