P Krishna
దేశంలో ప్రతి సంక్షేమ పథకానికి తప్పని సరి రేషన్ కార్డు ఉండాల్సిందే అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశంలో బోగస్ రేషన్ కార్డులు పెరిగిపోవడంతో ఈ-కేవైసీ ప్రక్రియ ప్రారంభిచారు.
దేశంలో ప్రతి సంక్షేమ పథకానికి తప్పని సరి రేషన్ కార్డు ఉండాల్సిందే అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశంలో బోగస్ రేషన్ కార్డులు పెరిగిపోవడంతో ఈ-కేవైసీ ప్రక్రియ ప్రారంభిచారు.
P Krishna
దశాబ్దాలుగా భారతదేశ సాంఘిక సంక్షేమ వ్యవస్థలో రేషన్ కార్డులు అంతర్భాగంగా ఉన్నాయి. ఆహార భద్రత, జనాభాలో నిత్యావసర వస్తువుల సమాన పంపిణీని నిర్ధారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) వర్గంలో ఉన్న వ్యక్తులకు రేషన్ కార్డ్ ఎంతో విలువైనది. రేషన్ కార్డు వివిధ సంక్షేమ పథకాలతో పాటు అవసరాలకు పనికి వస్తుంది. అయితే పేద ప్రజలకు మాత్రమే చెందాల్సిన రేషన్ కార్డు.. కొంతమంది స్వార్థపరులు తమ అవసరాల కోసం బోగస్ కార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోగస్ కార్డుల ఏరివేతకు రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ ప్రారంభించారు. తాజాగా రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..
దేశంలో రేషన్ కార్డు అంటే పేద ప్రజలకు ఒక ఆయుధం లాంటిది అంటారు. అయితే కొంతమంది డబ్బున్న వారు కూడా పేదవాళ్లమని చెబుతూ దొంగ పత్రాలు సృష్టించి రేషన్ కార్డు పొందుతున్నారు. అలాంటి వారి ఆగడాలను అరికట్టడానికి కేంద్రం రేషన్ కార్డుల ఈ-కేవైసీ కార్యక్రమం చేపట్టింది. పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు, పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్లిన ఆడపిల్లల పేర్లు అలాగే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయని.. దీన్ని అరికట్టడానికి ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టారు. జనవరి 31 లోగా లబ్దిదారులు తమ వేలిముద్రలతో రేషన్ కార్డును ధృవీకరించుకోవాలి. అయితే గడువు సమీపిస్తున్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో ఈ ప్రక్రియను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ 75.76 శాతం వరకే పూర్తయ్యింది. మరో నెల రోజులు గడువు పెంచడంతో వందశాతం ఈ-కేవైసీ పూర్తి చేయించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. దూర ప్రాంతాల్లో ఉన్న వారు అక్కడ షాపుల్లో కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం కూడా కల్పించారు. బోగస్ రేషన్ కార్డులను ఏరివేసేందుకు ఆధార్ కార్డులో లింక్ చేస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.