Arjun Suravaram
Telangana: తెలంగాణ రాష్ట్రానికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ గా ఈ రాష్ట్రానికి చెందిన ఠాణా ఎంపికైంది. వివిధ విభాగాల్లో మంచి స్కోర్ సాధించి..ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన ఆ పోలీస్టేషన్..
Telangana: తెలంగాణ రాష్ట్రానికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ గా ఈ రాష్ట్రానికి చెందిన ఠాణా ఎంపికైంది. వివిధ విభాగాల్లో మంచి స్కోర్ సాధించి..ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన ఆ పోలీస్టేషన్..
Arjun Suravaram
సమాజానికి సంబంధించిన భద్రత విషయంలో పోలీసులదే కీలక బాధ్యత. సంఘ విద్రోహక శక్తులను నుంచి ప్రజలను కాపాడుతూ.. వారికి రక్షణ కల్పించడంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. ఇక ప్రజలకు కూడా ఏదైనా గొడవలు, ఇతర నేరాలు జరిగితే..పోలీసులను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా పోలీస్ స్టేషన్లు.. తమ వద్దకు న్యాయం కోసం వచ్చే ప్రజలకు, బాధితులకు పరిష్కారం చూపిస్తుంటాయి. అంతేకాక ఠాణాకు వచ్చే వారి పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలోనే తరచూ దేశంలోనే పోలీస్ స్టేషన్లకు ప్రత్యేకమైన అవార్డులు ఇస్తుంటారు. ఆయా పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న విధుల, ప్రవర్తనల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ఈ క్రమంలోనే తెలంగాణకు అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ గా ఈ రాష్ట్రానికి చెందినది ఎంపికైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ విభాగంలో తెలంగాణకు చెందిన ఓ ఠాణా తొలిస్థానంలో నిలిచింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఈ రాణా అరుదైన ఘనతను సాధించింది. జనవరి 5న రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో జరిగే రాష్ట్రాల డీజీపీల కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును అందుకోనుంది. శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కారం, పోలీస్ స్టేషన కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడడం వంటి అంశాల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఈ క్రమంలోనే వివిధ అంశాల్లో మంచి మార్కులను రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కొట్టేసింది.
ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో టాప్ ప్లేస్ ను ఈ ఠాణా సాధించింది. మిస్సింగ్ కేసులను త్వరితగతిన ట్రెస్ చేయడం, ఫ్యామిలీ ఇష్యూలను కౌన్సెలింగ్ తో పోలీస్ స్టేషన్ స్థాయిలోనే పరిష్కరించడం వంటి అంశాల్లోనూ మంచి స్కోరును సాధించింది. వీటితో పాటుగా గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందితే, మృతదేహాలు దొరికినప్పుడు, వెంటనే గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయడం, పోస్టుమార్టం తర్వాత వెంటనే అప్పడగించడపై రాజేంద్రనగర్ పోలీసుల పనితీరును కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా అభినందించింది.
గతంలోనూ తెలంగాణ పోలీస్ శాఖకు వివిధ అంశాలు పలు అవార్డులు లభించాయి. తెలంగాణ పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీస్ పేరిట ప్రజలతో మమేకమవుతున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో పోలీస్ స్టేషన్ అంటే ఉండే ఓ రకమైన భయాన్ని తొలిగించడంలో పోలీసులు కీలక కృషి చేశారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితులతో ఎంతో ఫ్రెండ్లీతో సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈక్రమంలోనే రాజేంద్ర నగర్ కి దేశంలోనే తొలిస్థానం లభించింది. మరి.. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్ర నగర్ కి దక్కిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.