iDreamPost
android-app
ios-app

రాజన్నసిరిసిల్ల: క్రికెట్‌ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందకు వెళ్లారు.. అంతే..

  • Published Sep 03, 2023 | 2:28 PM Updated Updated Sep 03, 2023 | 2:28 PM
  • Published Sep 03, 2023 | 2:28 PMUpdated Sep 03, 2023 | 2:28 PM
రాజన్నసిరిసిల్ల: క్రికెట్‌ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందకు వెళ్లారు.. అంతే..

అన్నీ మనం అనుకున్నట్లుగానే జరిగితే అది జీవితం కాదు. మరు నిమిషంలో మన జీవితంలో ఏం జరుగుతుందో ఊహించలేం. అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగుతున్న జీవితం.. అరక్షణంలో నడి రోడ్డు మీదకు రావొచ్చు. అప్పటి వరకు ఎంతో సరదాగా ఉన్న వాళ్లు.. ఉన్నట్లుండి కుప్పకూలిన సంఘటనలు అనేకం చూశాం. ఇక తాజాగా ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు ఎంతో సరదాగా ఆడుకుంటున్నవారు.. వర్షం పడటంతో చెట్టు కిందకు వెళ్లారు. అదే వారి చేసిన తప్పు. ఇంతకు ఏం జరిగింది అంటే..

వారంతా.. స్నేహితులు.. సరదాగా క్రికెట్‌ ఆడుతున్నారు. ఇంతలోనే ఉన్నట్లుండి భారీ వర్షం ప్రారంభం అయ్యింది. దాంతో వారు పక్కనే ఉన్న చెట్టు కిందకు పరిగెత్తారు. అయితే వర్షంతో పాటు.. మెరుపులు, ఉరుములు, పిడుగులు పడ్డాయి. అయితే వారు నిల్చున్న చెట్టు పైన పిడుగు పడటంతో ఓ యువకుడు అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో నలుగురు సురక్షితంగా భయపడ్డారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా బోనాల సమీపంలో చోటు చేసుకుంది. గణేష్‌ నగర్‌కు చెందిన పడిగే సతీష్‌ అనే యువకుడు..ఘ ఆదివారం మరో నలుగురు స్నేహితులుతలో కలిసి క్రికెట్‌ ఆడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా వర్షం రావడంతో అక్కడ దగ్గరలో ఉన్న చెట్టు కిందకు వెళ్లారు.

దురదృష్టం కొద్ది చెట్టు మీద పిడుగు పడింది. దాంతో సతీష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ సమయంలో అతడి పక్కనే ఉన్న నలుగురు ఫ్రెండ్స్‌ అందరూ సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో వారిని వెంటనే అంబులెన్స్ లో సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సతీష్‌కు వైద్యులు వెంటనే చికిత్స అందించారు. కానీ అప్పటికే సతీష్‌ మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. మృతునికి భార్య మధు ప్రియ, ఒక కొడుకు ఉన్నారు. సతీష్‌ మెకానిక్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక సతీష్‌ మృతి చెందడంతో.. అతడి తల్లిదండ్రులు, భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాని కోరుతున్నారు.

ఇక రానున్న మూడు రోజుల పాటు.. రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షం వచ్చే సూచనలు ఉన్నా.. వాన పడే సమయంలో.. ఎవరూ చెట్ల కింద నిలబడవద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.