చదువుల్లో సరస్వతి.. టాప్ ర్యాంకు వచ్చినా.. గొర్రెలు కాస్తూ!

చదువు ఉంది కానీ లక్ష్మీ దేవి కటాక్షించడం లేదు. ప్రతిభ ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక ఎంతో మంది స్టూడెంట్స్ మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. చిన్న చితకా పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి స్థితినే ఎదుర్కొంటోంది ఓ అమ్మాయి.

చదువు ఉంది కానీ లక్ష్మీ దేవి కటాక్షించడం లేదు. ప్రతిభ ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక ఎంతో మంది స్టూడెంట్స్ మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. చిన్న చితకా పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి స్థితినే ఎదుర్కొంటోంది ఓ అమ్మాయి.

కొంత మందిని సర్వస్వతి కటాక్షిస్తే.. లక్ష్మీ దేవి కనికరించదు. ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, కుటుంబానికి అండగా నిలవాలని అనుకున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించక మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. డబ్బుల్లేక నిస్సహాయత స్థితిలోకి జారుకుంటున్నారు. తల్లిదండ్రులకు చదివించే స్థోమత లేకపోవడంతో. . చివరకు చిన్న చితకా పనులకు వెళుతూ.. కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ గ్రామీణ యువతి పరిస్థితి ఇప్పుడు ఇలానే మారింది. ఎంతో కష్టపడి చదువుకుంది. ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు కలలు కనే ఐఐటీలో ర్యాంక్ సాధించింది. కానీ చదువును కొనలేక.. మేకలు కాస్తుంది. అయితే తనను ఆదుకోవాలంటూ అభ్యర్థిస్తోంది. ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటుంది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వీర్నపల్లి మండలం బదావత్ నాయక్ తండాకు చెందిన బదావత్ రాములు-సరోజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. రాములు-సరోజలు వ్యవసాయ కూలీలు. తమ రెక్కల కష్టం మీదనే ఇద్దరు అమ్మాయిల్ని డిగ్రీ వరకు చదివించారు. ఈ ఇద్దరు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నారు. మూడో కూతురు మధులత ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంది. అలాగే జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబరిచి ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంక్ సాధించింది. ఆమెకు పాట్నా ఐఐటీలో సీటు లభించింది. అయితే ఈ ఆనందం ఎంతకాలం మిగల్లేదు. కాలేజీ ఫీజు రూ. 3 లక్షలు కట్టాలి. ఈ నెల 27వ తేదీన ఫీజు చెల్లించాల్సి ఉంది.

తండ్రి అంత డబ్బు కట్టలేని పరిస్థితి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు. అంత డబ్బు కట్టలేక.. అప్పు తీసుకునే పరిస్థితి కాక సతమతమౌతుంది ఈ కుటుంబం.  దీంతో డబ్బుల్లేక మేకలు కాయడానికి వెళుతోంది మధులత. అయితే ఆమెకు చదువుకోవాలన్న జిజ్ఞాస ఉంది. దీంతో తనకు ప్రభుత్వం  సాయం చేయాలని అభ్యర్థిస్తుంది ఈ గిరిజన పుత్రిక.  తమ కూతుర్ని ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఇప్పటి వరకు తన రెక్కల కష్టం మీదే సంసారాన్ని లాక్కోచ్చాడు రాములు. ఇద్దర్ని డిగ్రీ వరకు చదివించాడు. మూడో పాప దగ్గరకు వచ్చేసరికి ఫీజు కట్టలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఎవరైనా దాతలు ముందుకు రాకపోతారా అని ఎదురు చూస్తున్నారు దంపతులు. ఈ నేపథ్యంలో పాపను ఆర్థికంగా ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

Show comments