iDreamPost
android-app
ios-app

అద్భుతం.. వస్త్రంపై జీ20 దేశాధినేతల ఫొటోలు!

  • Published Sep 10, 2023 | 2:47 PM Updated Updated Sep 10, 2023 | 2:47 PM
అద్భుతం.. వస్త్రంపై జీ20 దేశాధినేతల ఫొటోలు!

ప్రస్తుతం దేశంలో భారత దేశంలో జీ-20 సదస్సు జరుగుతుంది. 20 దేశాల అధినేతలతో పాటు చాలా దేశాలకు చెందిన ప్రముఖులు ప్రజా ప్రతినిధులు హాజరు అయ్యారు. ప్రపంచం గర్వించే విధంగా జీ-20 సదస్సు కొనసాగుతుంది. ఇక భారత దేశంలో ఎంతోమంది తమ టాలెంట్ తో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేశారు.. అద్భుతాలు సృష్టించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. గతంలో చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టేంత చేరను తయారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ చేనేత కార్మికుడు తన ప్రతిభతో అందరిచే ఔరా అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో రాజన్న సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ గతంలో తన ప్రతిభతో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. తాజాగా మరో అద్భుతం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం దేశంలో జీ-20 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2 మీటర్ల పొడవు వున్న వస్త్రంపై జీ-20 సదస్సులో పాల్గొంటున్న దేశాధినేతల ఫోటోలను చిత్రించాడు. అంతేకాదు భారత జాతీయ చిహ్నం, జీ-20 లోగోను కూడా రూపొందించాడు. ఈ వస్త్రంపై ప్రధాని నరేంద్ర మోదీ హిందీలో నమస్తే అంటూ అభివాదం చేస్తున్న ఓ చిత్రాన్ని కూడా పొందుపరిచాడు.

ప్రస్తుతం వెల్ది హరిప్రసాద్ చేసిన ఈ వస్త్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అతని సృజనాత్మకతకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గత ఏడాది జీ – 20 లోగో ని ఓ వస్త్రంపై రూపొందించి ప్రధాని మోదీకి పంపించాడు హరిప్రసాద్. అతని ప్రతిభను గుర్తించి ప్రధాని ఇటీవల తన మన్ కి బాత్ లో సిరిసిల్ల హరిప్రసాద్ గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. ఇలా తెలంగాణ గొప్పతనాన్ని దేశానికి చాటిచెబుతున్న గొప్ప చేనేత కళాకారుడు అంటూ ప్రశంసించారు మోదీ. ఈ సారి వస్త్రంపై రూపొందించిన చిత్రాలు నేయడానికి వారం రోజులు పట్టిందని అంటున్నాడు. తనకు అవకాశం లభిస్తే.. స్వయంగా ప్రధానికి ఈ వస్త్రాన్ని అందిస్తానని అంటున్నాడు హరి ప్రసాద్.