Keerthi
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామిలను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే అన్నదాతలకు కూడా సర్కార్ ఓ మంచి శుభవార్తను అందించింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామిలను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే అన్నదాతలకు కూడా సర్కార్ ఓ మంచి శుభవార్తను అందించింది.
Keerthi
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజ సంక్షేమం పై దృష్టిసారించారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సర్కార్ తమవంతు కృషి చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం , ఆరోగ్య శ్రీ 10 లక్షల వరకు పెంపు, గృహజ్యోతి, అదే విధంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామిల మేరకు నెరవేర్చెందుకు కూడా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్నదాతలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఓ చక్కటి శుభవార్తను చెప్పారు. అదేమిటంటే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇచ్చిన ప్రతి హామిలను శరవేగంగా పూర్తి చేస్తోంది. అయితే అన్నదాతల విషయానికోస్తే.. రైతుబంధు మాత్రం కొందరికే విడుదల చేశారు.కాగా, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిధుల జ మ అనేది వారం రోజుల్లోనే పూర్తి చేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలు గడుస్తున్న ఆ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి చేయలేదు. దీంతో పెట్టుబడికి సాయం అందక రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాగే రైతుబంధు నిధులు ఇంకా జమ కాకపోవడంతో రైతన్నాలు వాపోతున్నారు. అయితే, దీనిపై తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు నిధులను ప్రతీ ఒక్కరికీ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. కానీ, ఆ నిధులనేవి సాగులో ఉన్న భూమి గల రైతులకు మాత్రమే ఉంటుదని స్పష్టం చేసింది. కాగా, కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.
అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చి.. కోట్ల రూపాయలను వృథా చేసిందని ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం.. రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు 3 నుంచి 4 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. ఇక ఈ నెలాఖరు వరకు అందరికీ జమ చేయనున్నట్లు తెలిపారు.ఇక వచ్చే వానాకాలం నుంచి రైతుబంధును.. రైతు భరోసాగా అమలు చేసి.. రూ.15 వేలు రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.