iDreamPost
android-app
ios-app

పీవీ, కేసీఆర్ రికార్డులు బ్రేక్.. చరిత్ర సృష్టించిన రఘువీర్ రెడ్డి!

  • Published Jun 05, 2024 | 8:33 AM Updated Updated Jun 05, 2024 | 8:33 AM

PV, KCR Break Records: దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. ఈ ఫలితాల్లో నల్లగొండ జిల్లాలో కనీ విని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీకి విజయాన్నిఅందించారు ఓటర్లు.

PV, KCR Break Records: దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. ఈ ఫలితాల్లో నల్లగొండ జిల్లాలో కనీ విని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీకి విజయాన్నిఅందించారు ఓటర్లు.

పీవీ, కేసీఆర్ రికార్డులు బ్రేక్.. చరిత్ర సృష్టించిన రఘువీర్ రెడ్డి!

నిన్న దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హూరా హూరీ పోటీ కొనసాగింది. చివరి వరకు చెరో ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉంటూ వచ్చాయి. తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉంటే.. అందులో కాంగ్రెస్ 8, బీజేపీ 8 స్థానాలు గెల్చుకున్నారు. హైదరాబద్ నుంచి ఎంఐఎం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఇక ఉద్యమ పార్టీగా చెబుతు వస్తున్న బీఆర్ఎస్ ఖాతానే తెరవలేదు. తెలంగాణలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కి కంచుకోట అని మరోసారి రుజువైంది. కనీ వినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపొందారు.. సమీప ప్రత్యర్థిపై ఆయన ఎన్ని ఓట్లతో గెలిచారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లా లోక్‌సభ నియోజకవర్గంలో గతంలో ఉన్న రికార్డులు బద్దలు కొడుతూ ఫలితాలు వెలువడ్డాయి. నల్లగొండ కాంగ్రెస్ కి కంచు కోట అని మరోసారి నిరూపించారు ఓటర్లు. ఒకటి కాదు రెండు కాదు.. 5 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సైది రెడ్డి శానంపూడి పై ఏకంగా 5,59,905 మెజార్టీలో గెలుపొంది పార్లమెంట్ రికార్డులన్నింటిని బ్రేక్ చేశారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎంపీ ఎన్నికలు జరిగితే..ఈ సారి ఫలితాలు రికార్డులు బ్రేక్ చేయడం గమనార్హం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. నల్లగొండ సెగ్మెంట్ కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్న కుందూరు రఘువీర్ రెడ్డి బరిలో దిగారు. బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేశారు.అయితే నల్లగొండ జిల్లాలో గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని చాటుకుంటూ వస్తుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం చాటింది. ఈ క్రమంలోనే నిన్న వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో మెజార్టీతో పాత రికార్డులు బద్దలు కొడుతూ కుందూరు రఘువీర్ రెడ్డి విజయం సాధించారు.