iDreamPost
android-app
ios-app

పోలీస్ స్టేషన్ లో సిబ్బందిపై కత్తితో సైకో వీరంగం!

  • Published Mar 28, 2024 | 9:43 PM Updated Updated Mar 28, 2024 | 9:43 PM

Psycho Attacked: మందు తాగితే లోకాన్నే మర్చిపోతారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్తితిలో దారుణాలకు తెగబడుతుంటారు.

Psycho Attacked: మందు తాగితే లోకాన్నే మర్చిపోతారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్తితిలో దారుణాలకు తెగబడుతుంటారు.

పోలీస్ స్టేషన్ లో సిబ్బందిపై కత్తితో సైకో వీరంగం!

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మద్యం సేవించి రోడ్లపై రెచ్చిపోతున్నారు.. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు మృగాలుగా మారిపోయి వారిపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. కొన్నిసార్లు రోడ్లపై అమాయకులపై రెచ్చిపోతుంటారు.   వ్యక్తి గత కక్ష్యలో నేపథ్యంలో మద్యం మత్తులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం.. హత్యలు చేయడం లాంటివి జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ మందుబాబులు రెచ్చిపోతూనే ఉన్నాయి. తాజాగా మద్యం సేవించి ఓ యువకుడు సైకోగా మారి పోలీస్ స్టేషన్ లో రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే..

ఓ యువకుడు మద్యం మత్తులో కత్తితో పోలీస్ స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చి వీరంగం సృష్టించాడు. ఆపడానికి వెళ్లిన పోలీసులపై దాడి చేశాడు. ఈ ఘటన రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి అర్థరాత్రి తన తల్లిదండ్రులతో గొడవ పడిన యువకుడు పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. అప్పటికే ఆ యువకుడు పీకల దాకా మద్యం సేవించి ఉన్నాడు. అయితే  మద్యం మత్తులో ఉన్న యువకుడితో రేపు ఉదయం మట్లాడుదాం అని పోలీసులు నచ్చజెబుతూ..  బుజ్జగించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ యువకుడు సైకోగా మారాడు. స్టేషన్ లో ఫర్నీచర్ ధ్వంసం చేశాడు.

తాను కేసు పెట్టాలని వస్తే రేపు..ఎల్లుండి అంటారా? అంటూ ఆ యువకుడు రెచ్చిపోయాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో పోలీసులపై అకస్మాత్తుగా దాడి చేశాడు. దీంతో పోలీసులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు..   ఒక్కసారిగా స్టేషన్ లో సిబ్బంది హడలిపోయారు. వెంటనే తేరుకొని సైకోని చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే దాడిలో గాయపడ్డ కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గతంలో ఆ యువకుడు పలుమార్లు పోలీస్ స్టేషన్ లో వీరంగం సృష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు. మద్యం సేవిస్తే ఆ యువకుడు మృగంగా మారిపోతాడని.. ఎవరి మాట విడనని అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రామారెడ్డి పోలీసులు చెబుతున్నారు.