iDreamPost

లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి నిరసన

లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని పెద్దపెద్దగా స్లోగన్లు చెప్పినా.. ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తున్న వారే ఎక్కువ. బాధితులు సైతం పని జరగాలంటే అధికారులకు ముడుపులు చెల్లించుకోవాల్సిందేనంటూ లంచం రూపంలో ఎంతోకొంత చదివిస్తున్నారు. అయితే..

లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని పెద్దపెద్దగా స్లోగన్లు చెప్పినా.. ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తున్న వారే ఎక్కువ. బాధితులు సైతం పని జరగాలంటే అధికారులకు ముడుపులు చెల్లించుకోవాల్సిందేనంటూ లంచం రూపంలో ఎంతోకొంత చదివిస్తున్నారు. అయితే..

లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి నిరసన

దేశంలో ఏ పని జరగాలన్నా కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిందే. కాళ్లు అరిగేలా తిరిగినా.. పనౌతుందంటే కల్లే. కేవలం ఆమ్యామ్యాలు ఇవ్వాల్సిందే. సంవత్సరాల పాటు కానీ పని కూడా చిటికెల్ చిన్న సంతకాలతో చకచకా పరుగులు పెడుతుంది. లేదంటే కొన్ని సంవత్సరాల పాటు ఫైళ్ల రూపంలో భద్రంగా నిద్రపోతుంటాయి. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అధికారుల పనితీరు ఇదే. లంచం ఇవ్వనిదే.. ఆ ఫైల్ ఏంటో అని కూడా పరిశీలించరు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని చెబుతున్నా.. ముడుపులు తీసుకుంటూ అధికారులకు పట్టుబడినా.. మార్పులేమీ జరగడం లేదు. అలాగే వ్యవస్థలో లంచగొండితనం తగ్గడం లేదు.

తాజాగా ఓ అధికారి లంచం అడిగితే.. ఏకంగా కరెన్సీ నోట్ల దండ తెచ్చి సత్కరించారు. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. సొసైటీ ఏర్పాటుకు లంచం డిమాండ్ చేస్తుండటంతో.. ఇలా చేశారు. వివరాల్లోకి వెళితే.. మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన మత్స్యకారుల కోసం కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలంటే రూ. 50 వేలు ముడుపులు చెల్లించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్ డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని చెబితే.. ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నాడు కానీ.. వారి పని చేయడం లేదు. సోమవారం కూడా తాము అంత డబ్బులు ఇవ్వలేమని, తమకు పనిచేసేందుకు జీతాలు తీసుకుంటున్నారు కదా అని ప్రశ్నిస్తే.. తన వెనుక మినిస్టర్ ఉన్నారని, మీరేం చేయలేరంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పాడు.

దీంతో విసిగిపోయిన మత్స్యకారులు అతడికి బుద్ది చెప్పాలని అనుకున్నారు. తొలుత ప్రజావాణిలో కలెక్టర్ యాస్మిన్ భాషాకు ఫిర్యాదు చేశారు. అనంతరం మత్స్యశాఖ ఆఫీసర్ దామోదర్ బయటకు రాగానే.. ఆయన మెడలో నోట్ల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సొసైటీ ఏర్పాటులో దామోదర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, ప్రశ్నిస్తే బెదిరిస్తున్నాడని, తమ వద్ద వీడియోలు కూడా ఉన్నాయని మత్స్యకారులు జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ తెలిపారు. కాగా, అందిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా స్పందించారు. దామోదర్ నుండి వివరణ కోరినట్లు తెలిపారు. ఈ లంచగొండితనం వల్ల మీరు బాధితులైనట్లయితే.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి