iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో రేవ్ పార్టీ భగ్నం.. ప్రముఖ నిర్మాత అరెస్ట్!

  • Author Soma Sekhar Published - 09:21 AM, Thu - 31 August 23
  • Author Soma Sekhar Published - 09:21 AM, Thu - 31 August 23
హైదరాబాద్ లో రేవ్ పార్టీ భగ్నం.. ప్రముఖ నిర్మాత అరెస్ట్!

భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. రేవ్ పార్టీ పేరుతో జరుగుతున్న దందాను పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి నార్కొటిక్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక రేవ్ పార్టీలో ప్రముఖ నిర్మాతతో పాటుగా పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని మాదాపూర్ విఠల్ రావు నగర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో ప్రముఖ నిర్మాత ఆధ్వర్యంలో ఈ రేప్ పార్టీని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ గుప్పుమన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాదాపూర్ విఠల్ రావు నగర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు మాకు సమాచారం అందింది. దాంతో మేం వెంటనే అక్కడికి చేరుకున్నాం. ఈ రేవ్ పార్టీ ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తేలింది. ఈ పార్టీలో నార్కొటిక్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కోకైన్, ఎల్ఎస్డీ, 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. పట్టు బడ్డ వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన యువతులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ నిర్మాత టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలకు ఫైనాన్షియర్ గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిర్మాత కదలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో అధికారులు నిఘా పెట్టారు. ఇతడు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పక్కా నిఘా, సమాచారంతో రేవ్ పార్టీపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş