ప్రయాణికులను దోచేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్! ఫ్లైట్ చార్జెస్ బెటర్!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో గొప్పగా జరుపుకుంటారు. వారం రోజుల నుంచి ముందే పండుగ వాతావరణం కనిపిస్తుంది.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో గొప్పగా జరుపుకుంటారు. వారం రోజుల నుంచి ముందే పండుగ వాతావరణం కనిపిస్తుంది.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు అంటుంటారు.. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ వారు అదే  ఫాలో అవుతున్నారని అంటున్నారు ప్రయాణికులు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో సంబరంగా జరుపుకుంటారు. వారం ముందు నుంచే దేశ, విదేశాల్లో ఉన్నవారంతా తమ సొంత గ్రామాలకు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ సమయం కలిసి వస్తుందని చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకుంటూ ఆర్టీసీ చార్జీల కన్నా డబులు, ట్రిపుల్ వసూళ్లు చేస్తున్నారని వాపోతున్నారు ప్రయాణికులు.  వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో అడ్డగోలుగా దోచేస్తున్నార ప్రయాణికులు బాధపడుతున్నారు. టికెట్ల రేట్లను వారికి ఇష్టం వచ్చినంత పెంచి వసూళ్లు చేస్తున్నారని, ప్రయాణికులు అవసరాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచేస్తున్నారని కొంతమంది ప్రయాణికులు వాపోతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులువు ప్రకటించడం, అందులోనూ శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఖర్చులకు ఏమాత్రం వెనుకాడకుండా సొంత ఊళ్ళకు జనాలు ఆసక్తి చూపించారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో బాగా రద్ది పెరిగిపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే బస్సుల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు టికెట్ ధరలు వసూళ్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకరకంగా చూస్తే వీటికన్నా ఫ్లైట్ చార్జెస్ బెటర్ అంటున్నారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగకు ఏపీ వాసులు ఎక్కువగా ఊళ్లకు వెళ్తుంటారు.. దీంతో 12 నుంచి 17 వ తేదీల వరకు ట్రావెల్స్ బుకింగ్స్ చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్లాలంటే కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఒక్కొక్కరి వద్ద రూ.5 వేలు వరకు చార్జీలు వసూళ్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. స్లీపర్, సెమీ స్లీపర్ బస్సులకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ విషయం రవాణాశాఖ అధికారుల దృష్టికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ కి ఫైన్ విధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి లో 5 ప్రైవేట్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. అడ్డగోలు చార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలను హెచ్చరించారు. మొత్తానికి పండుగ ఖర్చు కన్నా ట్రావెలింగ్ ఖర్చే ఎక్కువ అవుతుందని ప్రమాణికులు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments