iDreamPost

ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల దందా.. ఏకంగా అన్నేసి లక్షలా? ఇలా ఐతే సామాన్యులేమైపోవాలి?

Engineering Admissions: విద్య అవసరమే, వైద్యం అవసరమే. అలా అని మనుషులు తమ ఆస్తులను అమ్ముకునేలా ధరలు నిర్ణయిస్తామంటే ఎలా కుదురుతుంది. ఇలా అయితే పేదలకు, సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు విద్య, వైద్యం దొరకడం గగనం అయిపోతుంది. చదువుకున్న డిమాండ్ ని క్యాష్ చేసుకుని కొన్ని ప్రైవేట్ కాలేజీలు దందా సాగిస్తున్నాయి. లక్షల్లో ఇంజనీరింగ్ సీట్లను అమ్ముకుంటున్నాయి.

Engineering Admissions: విద్య అవసరమే, వైద్యం అవసరమే. అలా అని మనుషులు తమ ఆస్తులను అమ్ముకునేలా ధరలు నిర్ణయిస్తామంటే ఎలా కుదురుతుంది. ఇలా అయితే పేదలకు, సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు విద్య, వైద్యం దొరకడం గగనం అయిపోతుంది. చదువుకున్న డిమాండ్ ని క్యాష్ చేసుకుని కొన్ని ప్రైవేట్ కాలేజీలు దందా సాగిస్తున్నాయి. లక్షల్లో ఇంజనీరింగ్ సీట్లను అమ్ముకుంటున్నాయి.

ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల దందా.. ఏకంగా అన్నేసి లక్షలా? ఇలా ఐతే  సామాన్యులేమైపోవాలి?

విద్య, వైద్యం ఈ రెండూ మనిషికి అత్యవసరమైనవి కాబట్టి ఈ బలహీనతను పలు కార్పొరేట్ వ్యవస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. దొరికినకాడికి దొరికినంత దోచుకుంటున్నాయి. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభమవ్వకముందే.. మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలు మొదలైపోయాయి. గ్రూప్ లను బట్టి సీటుకి ఇంత అని ఒక రేటు నిర్ణయించారు. కంప్యూటర్ సైన్స్ సంబంధిత సీట్లకు ఏకంగా రూ. 5 లక్షల నుంచి రూ. 18 లక్షలు వరకూ డిమాండ్ చేస్తున్నారు. సాధారణ ప్రైవేట్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు 5 లక్షలు డిమాండ్ చేస్తుండగా.. పేరున్న కాలేజీల్లో 12 లక్షల నుంచి 18 లక్షలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో లక్ష 80 వేల మంది క్వాలిఫై అవ్వగా.. వీరిలో లక్షకు పైగా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ సీట్లను ఆశిస్తున్నారు. దీంతో ఆయా కాలేజీల మేనేజ్మెంట్లు కృత్రిమ కొరతను సృష్టించి ఫీజులు పెంచేశాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 170 ప్రైవేటు కళాశాలలు ఉండగా.. వాటిలో లక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అయినా సరే డిమాండ్ ఎక్కువగా ఉంది.. దొరకడం కష్టం అన్నట్టు ఒక ఫేక్ సందర్భాన్ని సృష్టించి అమాయకుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. టీఏఎఫ్ఆర్సీ రూల్స్ ప్రకారం.. కన్వీనర్ కోటాకు నిర్ణయించిన ఫీజును మాత్రమే మేనేజ్మెంట్ కోటాకు తీసుకోవాలి. కానీ కాలేజీ యాజమాన్యాలు రూల్స్ పాటించకుండా ఇష్తమొచ్చిన రేట్లను ఫిక్స్ చేస్తున్నాయి.

ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 70 శాతం సీట్లను, మేనేజ్మెంట్ కోటాలో 30 శాతం సీట్లను భర్తీ చేస్తారు. రూల్ ప్రకారం మేనేజ్మెంట్ కోటా సీట్లను జేఈఈ, ఎంసెట్ ర్యాంకులను బేస్ చేసుకుని కేటాయించాలి. స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్ ఫారంలు తీసుకుని మెరిట్ ఆధారంగా వారికి సీట్లు కేటాయించాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వారికే సీట్లను కేటాయిస్తున్నారు. ఇంకా ఏఐసీటీఈ నుంచి కాలేజీలకు, కోర్సులకు పూర్తి స్థాయిలో పర్మిషన్స్ రాలేదు. జేఎన్టీయూ, ఓయూ వంటి కాలేజీలు గుర్తింపు ఇవ్వలేదు. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీలు మాత్రం ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. జూన్ 27 నుంచి ఎంసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ డేట్ రాకముందే కొన్ని కాలేజీలు మేనేజ్మెంట్ సీట్లను అమ్మకానికి పెట్టేశాయి.

విద్యాశాఖ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ కోటాలో సీట్ల భర్తీకి షెడ్యూల్ ఇస్తుంది. అది రిలీజ్ కాకుండానే ప్రైవేట్ కాలేజీలు గలీజ్ దందాకు తెరలేపాయి. ఇది టీజీసీహెచ్ఈ ఛైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి దృష్టికి వెళ్లడంతో ఆయన ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్ల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని.. కాలేజీల నోటిఫికేషన్ ఆధారంగానే సీట్ల భర్తీ చేయాలని.. నోటిఫికేషన్ రాకుండా ఇష్టమొచ్చినట్టు సీట్లను భర్తీ చేయవద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నారని.. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ సీట్లను ఆన్లైన్ లో భర్తీ చేసినట్లే. ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్ లోనే భర్తీ చేయాలని ఆయన సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి