ప్రజా దర్భార్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి..

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి‌తో పాటు 11 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడు పెంచారు.

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి‌తో పాటు 11 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడు పెంచారు.

ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3 న ఫలితాలు వెలువడగా.. కాంగ్రెస్ విజయం సాధించింది. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో పదకొండు మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేశారు. తర్వాత గతంలో తాను ఇచ్చిన హామీ ప్రకారం రజినీ అనే నిరుద్యోగ దివ్యాంగురాలికి ఉద్యోగాన్ని పత్రాలన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించి ప్రజా దర్భార్ ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ ని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌ గా మార్చారు. తాజాగా ప్రజా దర్భార్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. తనదైన మార్క్ చాటుకుంటూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం అయిన మరుసటి రోజే ప్రజా భవన్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరయ్యారు. మంత్రులు, అధికారులు వినతీ పత్రాలను పరిశీలించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తాజాగా ప్రజా దర్భార్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా దర్భాన్ ఇప్పుడు ప్రజా వాణిగా పేరు మార్చారు. సామాన్యులు తమ కష్టాలు, గలం విప్పే కార్యక్రమాన్ని ప్రజా దర్భార్ కన్నా ప్రజావాణి అంటే బాగుంటుందని పలువురు అభిప్రాయం వెల్లడించడంతో ఈ పేరు మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రజావాణి కార్యక్రమం వారానికి రెండు రోజుల పాటు నిర్వహించాని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి మరుసటి రోజు ప్రగతి భవన్ ని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌ గా మార్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు సామాన్యులే కాదు.. ప్రతిపక్ష నేతలు సైతం ప్రగతి భవన్ కి వెళ్లే పరిస్థితి లేదని.. తమ ప్రభుత్వంలో అన్ని మార్పులు తీసుకువస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. గత శుక్రవారం ప్రజా దర్భార్ (ప్రజా వాణి) మొదలైనప్పటి నుంచి సోమవారం వరకు మొత్తం 4471 వినతీ పత్రాలు వచ్చాయని.. అందులో ఎక్కువగా డబుల్ బెడ్ రూమ్, పెన్షన్లకు సంబంధించిన అర్జీలే ఎక్కువ ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజా వాణి కార్యక్రమం ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాలని.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ప్రజా భవన్ కి చేరే సమయంలో వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగు నీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments