Dharani
Power Cuts: హైదరాబాద్ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఉండనున్నాయి అని వెల్లడించారు. ప్రాంతాల వారీగా ఆ వివరాలు మీ కోసం..
Power Cuts: హైదరాబాద్ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఉండనున్నాయి అని వెల్లడించారు. ప్రాంతాల వారీగా ఆ వివరాలు మీ కోసం..
Dharani
వేసవితాపం పెరుగుతోంది. ఈ నెలలో కొన్ని రోజులు భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది. అయితే ఈ నాలుగైదు రోజుల నుంచి మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆఖరికి హైదరాబాద్‌లో కూడా 42 డిగ్రీల ఉష్ణగ్రతలు నమోదవుతున్నాయి అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వేసవి తాపం పొరగడంతో.. ఏసీలు, కూలర్ల వినియోగం పెరుగుతోంది. ఈ సమయంలో కాసేపు కరెంట్ పోయిన భరించలేకపోతున్నాం. అలాంటిది గంటల తరబడి పవర్ కట్స్ అంటే.. జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతారు. ఈ క్రమంలో నగరవాసులకు విద్యుత్‌శాఖ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఉంటాయి అన్నారు. ఆ వివరాలు..
శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఉండునున్నాయి అని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మరమ్మత్తులు, మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
అలానే బంజారాహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది అని అధికారులు తెలిపారు.
అలాగే, సైఫాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు కరెంట్ కోతలు ఉండనున్నాయని ఏడీఈ ప్రేమానంద్ పాయ్ చెప్పారు. పద్మావతినగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10.30-1 గంట వరకు.. ఎర్రమంజిల్ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30-5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని ఆయన తెలిపారు.