Dharani
Ponguleti Srinivas Reddy: తెలంగాణలోని ఆ జిల్లాల వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచే ఆ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ వివరాలు..
Ponguleti Srinivas Reddy: తెలంగాణలోని ఆ జిల్లాల వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచే ఆ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఇప్పటికే చర్యలు తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి పథకాలను అమలు చేసింది. వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని భావించినప్పటికి.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. కొన్ని హామీల అమలకు అడ్డంకి ఏర్పడింది. ఇక జూన్ 4న ఫలితాలు వచ్చేశాయి. పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు 2024కి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 సీట్లలో విజయం సాధించగా.. ఎంఐఎం ఒక్క చోట మాత్రమే గెలిచింది. ఇక బీఆర్‌ఎస్ అయితే కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇక ఫలితాల సంగతి అలా ఉంచితే.. ఎన్నికల కోడ్ ముగియడంతో.. ఇక నేటి నుంచి తెలంగాణలో వారికి ఆ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. ఆ వివరాలు..
లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియటంతో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేస్తున్న వారిలో అర్హులైన వారందరికీ.. ఈరోజు నుంచే లబ్ది చేకూరనుందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గృహజ్యోతి పథకం కింద సున్నా బిల్లుల జారీకి నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ రాసుకొచ్చారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులను జారీ చేస్తుందని.. అర్హులైన అందరికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమం అందించనుందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఈ ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.
కాగా.. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ.. ఇంటి అవసరాల నిమిత్తం 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకునే వారికి గృహజ్యోతి పథకం కింద.. ఉచిత కరెంట్ అందిస్తుందని హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి 27న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా ఈ స్కీం అమల్లోకి రాలేదు. అయితే.. ఈరోజుతో ఎన్నికల కోడ్ ముగియడంతో అర్హులందరికీ నేటి నుంచి సున్నా బిల్లులు జారీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
మార్చి 1 నుంచి గృహజ్యోతి ఫ్రీ కరెంట్ పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లులు ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడతలో 39.9 లక్షల మందిని గృహజ్యోతి పథకానికి అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. ఇప్పటికే వీరిలో సుమారు 10 లక్షల మందికి పైగా వినియోగదారులకు ‘జీరో’ కరెంట్ బిల్లులు జారీ చేసింది. వీరంతా కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన పని లేదు.