Police Warning: బైక్‌పై వెళ్లే వారికి పోలీసులు వార్నింగ్! ఆ తప్పు చేస్తే కఠిన శిక్ష!

బైక్‌పై వెళ్లే వారికి పోలీసులు వార్నింగ్! ఆ తప్పు చేస్తే కఠిన శిక్ష!

Police Warning: బైక్ పై ఒకరు లేదా ఇద్దరు ప్రయాణం చేయాలి. అది ట్రాఫిక్ నిబంధన. కానీ కొంతమంది వాహనదారులు ఈ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. అలాంటి వారికి పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Police Warning: బైక్ పై ఒకరు లేదా ఇద్దరు ప్రయాణం చేయాలి. అది ట్రాఫిక్ నిబంధన. కానీ కొంతమంది వాహనదారులు ఈ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. అలాంటి వారికి పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినతరం చేస్తున్నా వాహనదారులు చేస్తున్న నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు అని అధికారులు అంటున్నారు. అవగాహన లేకుండా మైనర్లు వాహనాలు నడపడం, నిద్రలేమి, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. ఇటీవల వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టం క్రింద కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే బైక్ పై వెళ్లేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.

దేశం వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో తొలికేసు హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యింది. ఓ వాహనదారుడు నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడంతో అతడిపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 281,80(ఏ), 177 మోటర్ వెహికిల్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే సాధారణంగా ద్విచక్ర వాహనంపై ఒకరు లేదా ఇద్దరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది ట్రాఫిక్ నిబంధన అని అందరికీ తెలిసిందే. కానీ ఈ నిబంధనలు కొంతమంది పాటించకుండా పబ్లిక్ గా బైక్ పై ముగ్గురు కన్నా ఎక్కువ మంది కూర్చొని ప్రయాణిస్తున్నారు.

ద్విచక్ర వాహనంపై సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది కూర్చుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని  పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓల్డ్ టౌన్ టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ బైక్ పై నలుగురు, మరో బైక్ పై ఏకంగా ఆరుగురు కూర్చొని ప్రయాణించడం చూసి ఆశ్చర్యపోయారు.సదరు వాహనదారుడి వద్దకు వెళ్లి పిల్లలతో ఇలా బైక్ పై ప్రయాణించడం ప్రమాదం అని హెచ్చరించారు. ఆటోలో వెళ్లాలని అతనికి సూచించారు. ఇకపై బైక్ పై ప్రయాణించే వారు నిబంధనలు పాటించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హెల్మెట్ ధరించాలని, ఇద్దరి కన్నా ఎక్కువ మంది ప్రయాణించకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్ష కఠినంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

Show comments