Krishna Kowshik
అవసరాల కోసం వడ్డీ వ్యాపారాలను ఆశ్రయిస్తుంటే... ఇదే ఆసరాగా తీసుకుని.. ఫైనాన్స్ వ్యాపారులు ఇష్టా రీతిగానూ వడ్డీ వేస్తున్నారు. గడువులోపల తీర్చకపోయినా.. వడ్డీకి వడ్డీ వేసి.. వారి నడ్డి విరగ్గొడుతున్నారు.
అవసరాల కోసం వడ్డీ వ్యాపారాలను ఆశ్రయిస్తుంటే... ఇదే ఆసరాగా తీసుకుని.. ఫైనాన్స్ వ్యాపారులు ఇష్టా రీతిగానూ వడ్డీ వేస్తున్నారు. గడువులోపల తీర్చకపోయినా.. వడ్డీకి వడ్డీ వేసి.. వారి నడ్డి విరగ్గొడుతున్నారు.
Krishna Kowshik
వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకుని.. ఇంకా కుబేరుడికి వడ్డీ కడుతున్నట్లుగా.. సామాన్యుడి పరిస్థితి కూడా ఇలానే మారిపోయింది. అత్యవసరాలకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారాస్తుడిని ఆశ్రయిస్తున్నారు కొందరు. ఇదే అదునుగా తీసుకుని.. వడ్డీ వ్యాపారులు.. పెద్ద దందా నడుపుతున్నారు. తీసుకున్నాక సకాలంలో అసలు, వడ్డీ చెల్లించకపోతే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఒక రోజు వడ్డీ కట్టకపోయినా దానికి చక్ర వడ్డీ వేస్తున్నారు. దీంతో అసలు కన్నా, వడ్డీనే ఫైనాన్సర్లకు ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక కట్టలేకపోతే అప్పు తీసుకున్న వారిని వేధిస్తున్నారు. లేకుంటే.. వారి ఇంటి మీదకు వెళ్లి గొడవ చేస్తున్నారు.
విలువైన ఆస్తులు తమ పేరు మీద బలవంతంగా రాయించుకుంటున్నారు లేదా ఇంట్లో ఖరీదైన సామాన్లు తీసుకెళుతున్నారు. వారిని నడి రోడ్డు మీదకు లాగి.. పరువు తీస్తున్నారు. ఈ అప్పుల బాధ, ఆ ఊబి నుండి బయటపడలేక చాలా మంది చనిపోతున్నారు. కామారెడ్డిలో ఈ తరహా వేధింపులు ఎక్కువ కావడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు వెల్లువలా రావడంతో.. వడ్డీ వ్యాపారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏక కాలంలో దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేశారు. చిన్న చిన్న వడ్డీ వ్యాపారాన్నినడుపుతున్న ఫైనాన్స్ సంస్థలపై దాడులకు ఆదేశించారు ఎస్పీ సింధూశర్మ. దాడులు చేపట్టి.. 14 మందిపై కేసులు నమదు చేశారు.
184 ప్రామిసరీ నోట్లు, 12 చెక్ బుక్‌లు, భూమి, ఇండ్లు, ఇండ్ల స్థలాల మార్టిగేజ్ పేపర్లు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకన్నారు. జిల్లాల్లో రిజిస్టరైన ఫైనాన్సు సంస్థలు పదుల సంఖ్యలో ఉండగా.. పర్మిషన్లు లేకుండా నడుపుతున్నవి వందలకొద్దీ ఉన్నాయని తేటతెల్లమైంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, లింగం పేట, భిక్కనూరు, పిట్లం, గాంధారి వంటి ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతు లేకుండా పోయందని తెలుస్తోంది. నూటికి ధర్మవడ్డీకి కాకుండా.. 3 రూపాయాల నుండి పైనే వసూలు చేస్తన్నారు. చెల్లించని సమక్షంలో వడ్డీకి వడ్డీ వేసి.. రుణగ్రస్తుల నడ్డి విరిచేస్తున్నారు. అప్పులు చెల్లించలేని వారిని టార్గెట్ చేస్తూ.. బలవంతంగా ఆస్తులు రాయించుకుంటున్నారు.
కొంత మంది అయితే.. అప్పు కట్టేసిన తర్వాత కూడా.. ప్రామిసరీ నోట్లు వారికి ఇవ్వకుండా.. ఇంకా అప్పు కట్టాలంటూ మోసం చేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఎక్కువ అవుతున్నాయి. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. కామారెడ్డిలో ఓ ఫైనాన్స్ వ్యాపారి ఇలానే రుణగ్రస్తులను వేధిస్తుండగా.. చివరికి ఓ బాధితుడు..నేరుగా ఎస్పీకి కంప్లయింట్ చేయడంతో.. ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత దాడులు నిర్వహించి.. కేసులు బనాయించారు. మొత్తంగా 14 మందిపై కేసులు నమోదు అయ్యాయి. వడ్డీ వ్యాపారం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని చెప్పారు ఎస్పీ సింధూ శర్మ.