రెడీమేడ్ అల్లం వెల్లులి పేస్ట్ వాడుతున్నారా..! ఆరోగ్యం డేంజర్లో పడ్డటే?

Fake Ginger Garlic Paste: ఇటీవల కొంతమంది డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. మనం వాడే ప్రతి ఆహారపదార్థాల్లో కల్తీకి పాల్పపడుతున్నారు. వినియోగదారుల ప్రాణాలు రిస్క్ లో పెడుతున్నారు.

Fake Ginger Garlic Paste: ఇటీవల కొంతమంది డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. మనం వాడే ప్రతి ఆహారపదార్థాల్లో కల్తీకి పాల్పపడుతున్నారు. వినియోగదారుల ప్రాణాలు రిస్క్ లో పెడుతున్నారు.

డబ్బుకు లోకం దాసోహం..అన్నట్టు డబ్బు కోసం ఈ మధ్య కొంతమంది ఎలాంటి నీచమైన పనులు చేయడానికైనా తయారవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే యావతో ఎన్నో అక్రమాలు, మోసాలకు పాల్పపడుతునారు. ఎదుటి వారి ప్రాణలు పోయినా.. తమకు డబ్బు వస్తే చాలు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు కొంతమంది వ్యాపారులు. నిత్యంవాడే నిత్యావసర సరుకుల్లో కల్తీ చేస్తు వినియోగదారుల ప్రాణాలు డేంజర్లోకి తోస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేసి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిబంధనలు తిలోదకాలు ఇస్తూ తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా నగరంలో నకిలీ అల్లం వెల్లు పేస్టు తయారీదారుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..

నేటి సమాజంలో డబ్బు సంపాదించుకోవడానికి కొంతమంది వ్యాపారులు ఎన్నో దారుణాలకు తెగబడతున్నారు. ముఖ్యంగా ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు మనం వాడే ప్రతి ఆహారపదార్థాలు కల్తీ చేస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆహార పదార్థాలను నకిలీ చేసి అమ్ముతున్న వారిపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఎక్కడో అక్కడ చాటుమాటున తమ దందాలు కొనసాగిస్తున్నారు. నకిలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇవి ఏవీ తెలియక వినియోగారులు రెడిమేడ్ అల్లం తిని అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా బుద్వేల్ గ్రీన్ సిటీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు సైబరాబాద్ కి చెందిన SOT పోలీసులు.

ఈ దాడిలో దాదాపు 15 లక్షలకు పైగా విలువైన 7 టన్నుల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్స్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ తో ఈ పేస్టు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అప్నా ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఈ ఫ్యాక్టరీని నడిపిస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఒక్క ఫ్యాక్టరీనే ఉందా? మరెక్కడైనా ఇలాంటి ఫ్యాక్టీరీని నడుపుతున్నారా? ఇప్పటి వరకు ఎంత సరుకు మార్కెట్ లోకి పంపించారు?  అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.  ఇలాంటి నకిలీ పేస్టుల వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి వినియోగారులు భయంతో ఆందోళన చెందుతున్నారు.

Show comments