Arjun Suravaram
ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన వారిని పోలీసులు దేవుళ్లలా వచ్చి.. రక్షిస్తున్నారు. గుండె పోటు గురైన వారికి సీపీఆర్ చేసి.. ప్రాణాలు రక్షించిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే.. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడారు ఓ కానిస్టేబుల్.
ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన వారిని పోలీసులు దేవుళ్లలా వచ్చి.. రక్షిస్తున్నారు. గుండె పోటు గురైన వారికి సీపీఆర్ చేసి.. ప్రాణాలు రక్షించిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే.. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడారు ఓ కానిస్టేబుల్.
Arjun Suravaram
మానవ జన్మ అనేది చాలా అరుదైనది. అందుకే ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యంగా నిలబడాలి. కానీ నేటి కాలంలో చాలా మందిలో ధైర్యం అనేది కొరవడి ప్రతి సమస్యకు చావే పరిష్కారంగా భావిస్తున్నారు. ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రాణం విలువ తెలియక వాళ్లు అలాంటి పిచ్చి పనులకు యత్నిస్తుంటే.. దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి కొందరి ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు నిలబెడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకోగా.. 2 కిలోమీటర్లు భూజాలపై మోసి..అతడి ప్రాణాలను ఓ కానిస్టేబుల్ కాపాడారు. ఈ ఘటన కరీనంగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
సాధారణంగా పోలీసులు అంటే కేవలం సమాజంలో నేరాలు ఘోరాలు అరికట్టే వారు అని మాత్రమే మనకు తెలుసు. అలానే వారిపై చాలా మందికి ఓ తెలియని నెగిటీవ్ భావన కూడా ఉంటుంది. అయితే చాలా మంది పోలీసులు ఎంతో నిజాయితీతో, అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. అలానే మరికొందరు పోలీసులు..తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎందరో సామాన్యులను కాపాడి..వారి జీవితం నిలబెడుతున్నారు. గతంలో హార్ట్ ఎటాక్ వంటి వాటికి గురైన వారిని సీపీఆర్ చేసి..కాపాడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా ఓ కానిస్టేబుల్ చేసిన పని చూస్తే.. సెల్యూట్ చేయక మానరు. పొలంలో పురుగుల మందు తాగిన వ్యక్తిని..తన భుజాలపై 2 కిలోమీటర్లు మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన కుర్ర సురేష్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే బుధవారం సురేష్ ఇంట్లో వారితో ఓ విషయంలో గొడవ పడ్డాడు. అనంతరం మనస్తాపంతో సమీపంలో ఉన్న తమ పొలం వద్ద వెళ్లి పురుగుల మందు తాగాడు. సురేష్ పురుగులు మందు తాగడం గమనించిన పక్కన పొలాల్లో ఉండే వారు.. అతడిని గమనించి 100కు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో వెంటనే బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోమ్‌గార్డు కిన్నెర సంపత్‌లు అక్కడికి చేరుకున్నారు. అయితే సురేష్ అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో ఆలస్యం చేస్తే అతడి ప్రాణానికే ప్రమాదమని గ్రహించిన కానిస్టేబుల్ జయపాల్ సమయస్ఫూర్తిని ప్రదర్శించారు.
కానిస్టేబుల్ జయపాల్ సురేష్ ను తన భుజాన వేసుకుని సుమారు 2 కిలోమీటర్లు పొలాల గట్ల మీదుగా పరిగెత్తాడు. అలా వరి పొలాల గట్లపై పరిగెడుతు సురేష్ ను గ్రామంలోకి తీసుకొచ్చారు. అనంతరం కుటుంబ సభ్యుల సహాయంతో జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సురేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. సకాలంలో సురేష్‌ను కాపాడిన బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్ పై ఆ గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు. పోలీసు రూపంలో దేవుడిలా వచ్చి తమ బిడ్డ కాపాడవని సురేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సురేష్ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ జయపాల్ ను, ఇతర సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. ఇలా ఇటీవల కాలంలో ప్రమాదంలో ఉన్న సామాన్యులను చాలా మంది పోలీసులు కాపాడుతున్నారు. మరి.. ఇలా తమ ప్రాణాలకు తెగించి.. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడుతున్న పోలీసుల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.