టీవీ5 సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు!

Sambasiva Rao: టీవీ5 సాంబశివరావుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఓ స్థలానికి సంబంధించిన లీజు వ్యవహారంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Sambasiva Rao: టీవీ5 సాంబశివరావుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఓ స్థలానికి సంబంధించిన లీజు వ్యవహారంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సమాజంలో అనేక రకాల మోసాలు జరుగుతుంటాయి. అయితే కొందరు మోసాలు చేసి.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ముఖ్యంగా పెద్దలం అనే ముసుగు వేసుకుని అనేక అక్రమాలకు పాల్పడుతుంటారు. బాధితులు తిరగపడి పోలీస్ స్టేషన్ గడప తొక్కినప్పుడు వారి అక్రమాలు బయటకు వస్తుంటాయి. తాజాగా ప్రముఖ న్యూస్ రీడర్ సాంబశివరావుపై కేసు నమోదైంది. ఇక ఏ కేసు విషయంలో ఆయనపై కేసు నమోదైంది, ఎవరు చేశారు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీవీ5 సాంబశివరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన టీవీ5 వేదికగా నిత్యం రాజకీయ అంశాల గురించి డిబేట్లు పెడుతుంటారు. తాను వల్లించేవి రాజకీయ ప్రవచనాలుగా ఆయన ఫీలవుతుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయనపై భూ వ్యవహారం కేసు విషయంలో మాదాపూర్  పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సాంబశివరావు మీడియా వృతితో పాటు పెట్రోల్ బంకుల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మాదాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ బంకు నిర్వహణకు స్థలం లీజుకు ఇచ్చిన అంశంలో సాంబశివరావుపై, ఆయన కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు వచ్చాయి.  హిందూస్థాన్ పెట్రోలియంకు తాము సంతాకాలు చేయకుండానే తమ సంతకాలతో లీజు పత్రాలను సృష్టించారన్నది వారిపై ప్రధాన అభియోగం. ఈ క్రమంలనో సాంబశివరావుపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

టీవీ5 అనే మీడియా ఛానల్ లో  సాంబశివరావు డిబెట్లు నిర్వహిస్తుంటారు. ఆయన నిత్యం వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై  అసత్య వార్తలను ప్రచారం చేస్తుంటారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అవినీతి అంశాల గురించి ప్రస్తావించే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి.  సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శేరిలింగపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ ఈ స్థలం కూడా  సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లు అగ్రిమెంట్ చేసుకున్నారని బాధితులు ఆరోపించారు.

ఇక ఈ అంశంపై సాంబశివరావు, ఆయన కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదకే బదిలీ చేస్తామని నమ్మించారని పేర్కొన్నారు. ఎంతకాలం అయినా చెప్పిన పని చేయకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు హిందూస్థాన్ కార్పొరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమ అనుమతి లేకుండా.. తమ సంతకాలతో డాక్యుమెంట్ల రూపొందించినట్లు గుర్తించారు. బాధితులు కంపెనీ ప్రతినిధులకు అసలు విషయం చెప్పి బాధ పడ్డారు. ఈ ఇష్యుపై స్పందించిన కంపెనీ అధికారులు.. మూడేళ్లుగా లీజు ఎరియార్స్ చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. స్థలం విషయంలో సాంబశివరావు  ఫ్యామిలీ చేసిన మోసానికి ఏం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితులు మాదాపూర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Show comments