iDreamPost

దుకాణాల్లో కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వాడుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా!

  • Published Jan 11, 2024 | 11:45 AMUpdated Jan 11, 2024 | 11:45 AM

ఇప్పుడున్న ప్రజలంతా బిజీ లైఫ్ లో సమయం సరిపోకా.. చాలా మంది రెడిమేడ్ వస్తువులపై ఆధారపడిపోతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్దాల విషయంలో బయట తినడానికే ఇష్టం చూపిస్తారు. ఈ క్రమంలో వికారాబాద్ లో కల్తీ అల్లం పేస్టు విషయం బయటపడింది.

ఇప్పుడున్న ప్రజలంతా బిజీ లైఫ్ లో సమయం సరిపోకా.. చాలా మంది రెడిమేడ్ వస్తువులపై ఆధారపడిపోతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్దాల విషయంలో బయట తినడానికే ఇష్టం చూపిస్తారు. ఈ క్రమంలో వికారాబాద్ లో కల్తీ అల్లం పేస్టు విషయం బయటపడింది.

  • Published Jan 11, 2024 | 11:45 AMUpdated Jan 11, 2024 | 11:45 AM
దుకాణాల్లో కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వాడుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా!

ప్రస్తుతం మార్కెట్ లో ప్రతి వస్తువు అందుబాటులోనే ఉంది. ఏం కావాలన్నా క్షణాల్లో కళ్ళ ముందు ప్రత్యక్షమవుతోంది. అయితే, మనం కొనుగోలు చేసే ప్రతీది స్వచ్చంగా ఉంటుందా అంటే.. లేదనే చెప్పాలి. ఎక్కడో కొంతమంది మాత్రమే నాణ్యమైన వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. ఇంకా ఆహార పదార్ధాల గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మనం తినే పదార్ధాలు ఏ విధంగా కల్తీ అవుతున్నాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా వికారాబాద్ లో అమ్ముతున్న కల్తీ అల్లం పేస్టు విషయం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నకిలీ అల్లం పేస్టును అమ్ముతున్న గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వికారాబాద్ కు చెందిన పోలీసులు.. ఆ పట్టణం లోని ఓ హోటల్ సమీపంలో.. వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికీ ఓ ఆటోలో “హై ఫైవ్, టేస్ట్ కింగ్ టైగర్” అనే పేరుతో కొన్ని డబ్బాలు కనిపించాయి. ఆ డబ్బాలలో ఉన్నది మనం నిత్యం వంటల్లో వాడుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అవి నకిలీ పదార్దాలుగా గుర్తించారు. అయితే, వీటిని తరలిస్తున్న మనుష్క్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ డబ్బాలను హైదరాబాద్ అత్తాపూర్ కు చెందిన అజిత్ చరణ్య.. అనే వ్యాపారి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ తరువాత పోలీసులు అజిత్ చరణ్య ఇంటి మీద కూడా దాడులు చేశారు. ఈ క్రమంలో అతని వద్ద నుంచి దాదాపు ముప్పై కిలోల కల్తీ అల్లం పేస్ట్ ను, 11.41 క్వింటాళ్ల ఇతర రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ అల్లం పేస్టును.. వెల్లుల్లి పొట్టు, యాసిడ్, ఇతర రసాయనాలతో తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ రసాయనాలు ప్రాణాలకు చాలా ప్రమాదకరమని వారు తెలియాయేజేశారు. వీటిని తయారు చేస్తున్న అజిత్‌తో పాటు విక్రయిస్తున్న మనుష్క్‌పై పోలీసు కేసు నమోదు చేశారు. ఈ సరుకును ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఆటోను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.

Ginger garlic paste with acid

కాగా, డబ్బు కోసం ప్రజల ప్రాణాల సైతం లెక్కచేయకుండా.. ఇటువంటి కల్తీ వ్యాపారస్తులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి బయట ఆహార పదార్ధాలను తినడం కంటే.. ఇంట్లో తయారుచేసుకున్న పదార్ధాలను తినడం ఎంతో ఉత్తమం అని చెబుతున్నారు. ఏదేమైనా.. మార్కెట్ లో ఇలాంటి కల్తీ సరుకును విక్రయించేవారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ప్రజలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం.. వీలైనంత వరకు  వారి ఇళ్లలోనే ఆహారాన్ని వినియోగించుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. సాధ్యానమైనంత వరకు బయట ఆహార పదార్దాలను కొనుగోలు చేయకపోవడం మంచిది. మరి, వికారాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నకిలీ అల్లం పేస్టు ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి