P Krishna
Yadadri Temple: తెలుగు రాష్ట్రాలో తిరుపతి తర్వాత ఆ స్థాయిలో భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం యాదాద్రి. గత ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించింది. నాటి నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది.
Yadadri Temple: తెలుగు రాష్ట్రాలో తిరుపతి తర్వాత ఆ స్థాయిలో భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం యాదాద్రి. గత ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించింది. నాటి నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది.
P Krishna
తెలంగాణలో తిరుమల తిరుపతిగా ప్రసిద్ది చెందింది యాదాద్రి పుణ్యక్షేత్రం. గత ప్రభుత్వం యాదాద్రి రూపురేఖలు పూర్తిగా మార్చింది.. లక్ష్మీనరసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించింది. నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత అత్యధికంగా భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం యాదాద్రి అంటారు. అంతేకాదు కొత్తగా నిర్మించిన లక్ష్మీనరసింహుడి వైభవాన్ని చూడటానికి భక్తులు ఆసక్తితో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా తిరుమల తరహాలో యాదాద్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో యాదాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. వేలాదిగా లక్ష్మీనరసింహుడి దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత అత్యధికంగా భక్తులు దర్శనం చేసుకునేందుకు వచ్చేది యాదాద్రికే అన్న విషయం తెలిసిందే. యాదాద్రి కి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇక నుంచి తిరుమల తిరుపతి తరహాలో యాదాద్రి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం పరిధిలో ప్లాస్టీక్ పూ పూర్తి నిషేదం విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అన్నవరం దేవస్థానంలో కూడా ప్లాస్టీక్ పై నిషేదం కొనసాగుతుంది. ఈ ఆలయల్లోకి భక్తులు, సిబ్బంది ఎవరూ ప్లాస్టీక్ వస్తువులు తీసుకువెళ్లడానికి వీలులేదు. అదే తరహాలో ఇప్పుడు యాదాద్రి లో కూడా ప్లాస్టిక్ పై నిషేదం విధించారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగాంగా ప్లాస్టిక్ వాడకం నిషేదిస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం విధించనట్లు వెల్లడించారు. ఈ మేరకు దేవస్థానంలోని వివిధ భాగాలకు ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ప్లాస్టికేతర వస్తువులు ఉపయోగించాలని సూచించారు. ఈ నిషేదాన్ని సిబ్బంది విధిగా పాటించాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కూడా ప్లాస్టిక్ కవర్లు తీసుకురాకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్లాస్టీక్ నిషేదం విషయంలో నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానా విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆదేశాలు పాటించి ప్లాస్టీక్ నిషేదం సక్రమంగా జరిగితే యాదాద్రి మరింత సుందరంగా కనిపిస్తుందని అంటున్నారు.