iDreamPost
android-app
ios-app

యాదాద్రి భక్తులకు బిగ్ షాక్..ఇకపై ఫొటోలు, వీడియోలు నిషేధం..!

  • Published Oct 23, 2024 | 1:25 PM Updated Updated Oct 23, 2024 | 1:25 PM

Yadadri: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి యాదగిరి గుట్ట. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.

Yadadri: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి యాదగిరి గుట్ట. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.

యాదాద్రి భక్తులకు బిగ్ షాక్..ఇకపై ఫొటోలు, వీడియోలు నిషేధం..!

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. తాజాగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇక నుంచి యాదగిరి గుట్టపై ఫోటోలు, వీడియోలు పూర్తిగా నిషేదం విధిస్తున్నట్లు ఆలయ ఈఓ భాస్కర్ రావు ప్రకటించారు. కొంతమంది ఆలయ ప్రాంగణంలో యథేచ్ఛగా వీడియోలు, ఫోటోలు తీస్తూ ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన వారు మాఢ వీధుల్లో ఫోటోలు, వీడియోలతో పాటు రీల్స్ చేస్తూ ఆయల ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు.  దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫోటోలు, వీడియోలపై నిషేదం విధించాలని  నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ భాస్కర్ రావు తెలిపారు. కాకపోతే దర్శనానికి వచ్చే భక్తులు మాఢ వీధుల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి స్వామి వారి జ్ఞాపకంగా భద్రపర్చుకుంటే అభ్యంతరం లేదని అన్నారు. వ్యక్తిగతంగా రీల్స్ లాంటివి చేయడం వల్ల ఆలయ ప్రతిష్టకు భంగం కలగడమే కాదు, భక్తుల మనోభావాలు, విశ్వాసానికి అపనమ్మకం ఏర్పడుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ పాలనలో యాదగిరి గుట్ట సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. ఇక్కడ అద్భుతమైన శిల్పకళతో అబ్బురపోయే విధంగా తీర్చిదిద్దిన ఆలయాన్ని దర్శించుకోవడానికి తెలంగాణ నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో పాటు.. ఆలయ శిల్పకళను చూసి మంత్రముగ్దులవుతున్నారు.

ఈ క్రమంలోనే భక్తులు ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. కానీ, ఇటీవల కొంతమంది ఫోటోలు, వీడియోలు, రిల్స్ చేసుకునే వారి సంఖ్య ఎక్కువ కావడంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురు తో కలిసి యాదాద్రి ఆలయం మాడవీధుల్లో ఫోటో షూట్, రీల్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ఆలయ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవానికి ఆలయంలోకి మొబైల్, కెమెరాలు అనుమతి లేదు. మాడవీధుల్లో మాత్రం ఫోటోలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కొంతమంది ఫోటో గ్రాఫర్లు ఫ్యామిలీ ఫోటోలు తీస్తూ.. వెంటనే ప్రింట్ ఇస్తుంటారు. అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోటో షూట్ వివాదాస్పదంగా మారడంతో ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో భాస్కర్ రావు అన్నారు. అధికారులు తీసుకున్న రూల్స్ పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.