iDreamPost
android-app
ios-app

మహిళా కండక్టర్‌ను ప్రశంసించిన ప్రయాణికుడు.. TGSRTC సజ్జనార్ రిప్లై

ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిమీద బయటకు వెళ్లేటప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తుంటాం. కాసేపటికీ ఆపసోపాలు పడిపోతుంటాం. కానీ అందులోనే పనిచేేసే ఉద్యోగుల గురించి ఆలోచించామా... కానీ ఓ ప్రయాణీకుడు గుర్తించి.. ఆమెకు అక్షరాలతో..

ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిమీద బయటకు వెళ్లేటప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తుంటాం. కాసేపటికీ ఆపసోపాలు పడిపోతుంటాం. కానీ అందులోనే పనిచేేసే ఉద్యోగుల గురించి ఆలోచించామా... కానీ ఓ ప్రయాణీకుడు గుర్తించి.. ఆమెకు అక్షరాలతో..

మహిళా కండక్టర్‌ను ప్రశంసించిన ప్రయాణికుడు.. TGSRTC సజ్జనార్ రిప్లై

బస్సులో కాసేపు ప్రయాణం చేస్తేనే ఆపసోపాలు పడిపోతుంటారు సామాన్య జనం. అలాంటిది అందులో ఉద్యోగాలు చేసే డ్రైవర్, కండక్టర్ల సంగతి చెప్పనవసరం లేదు. ఎంత ప్రభుత్వ ఉద్యోగమైనా.. కిక్కిరిసిపోయే జనాల్లో టికెట్ టికెట్ అంటూ కండక్టర్స్ చేసే కష్టం ఎవరికీ తెలియదు. కాస్తంత దూరానికే సీటు లేకపోతే అల్లాడిపోతుంటారు. కానీ ఖాళీ ఉంటే తప్ప.. మిగిలిన సమయాల్లో తన కాళ్ల మీద నిలబడే ఉద్యోగాన్ని చేసే కండక్టర్స్ గురించి ఎవరూ ఆలోచించరు. ఇక ఎంతో మందికి సమాధానం చెప్పుకుంటూ వెళుతుంటారు. కానీ వారి కష్టాన్ని ఎవ్వరు గుర్తించరు. అయినప్పటికీ ఆడుతూ, పాడుతూ పని చేస్తుంటారు. అయితే ఓ సగటు ప్రయాణీకుడు.. ఓ కండక్టర్ పని తీరుకు మెచ్చి ఆమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

‘అనుపమ ది సిటి బస్ కండక్టర్’ అంటూ ఆమె గురించి పొగుడుతూ పెద్ద వ్యాసమే రాశాడో సిద్దార్థి సుభాష్ చంద్రబోస్ అనే ప్రయాణికుడు. హైదరాబాద్ మెహదీ పట్నం నుండి ఆరాంఘర్‌కు వెళ్లే ఓ బస్సులో అతడు ప్రయాణించగా.. అక్కడ కండక్టర్ అనుపమ పని తీరుకు ముగ్దుడై.. ఇంత వరకు ఇలాంటి ఉద్యోగిని చూడలేదంటూ ప్రశంసించాడు. ఓ వ్యక్తి ఆరాంఘర్ వస్తే చెప్పు అంటే..నువ్వు ఆరాంగా నిద్రపో, ఆరాంఘర్ వచ్చాక నేను నిద్ర లేపుతాను అంటూ చెప్పడం. అలాగే బస్సులో ఎక్కిన ప్రయాణీకుల బాగోగులు అడగడం అతడ్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్దల్నే కాదు.. కాలేజీలకు వెళ్లే ఆడపిల్ల్ని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించే తీరు మెచ్చి ఈ వ్యాసం రాసేలా చేసింది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఆమె పలకరిస్తోంది.

ప్రతి ఉద్యోగి మీలా ఉండాలి అంటూ ఆమె ఫోటో తీసుకుని ఏం పేరమ్మా అని అడిగితే.. అనుపమా అని చెప్పిందని, నవ్వుతూ బతకాలి, చివరకు ఏమీ మిగలదు కదా అంటూ సత్యం చెప్పిందంటూ ప్రశంసించాడు. ఇప్పుడు దీన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పంచుకున్నారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ‘కండక్టర్ అనుపమ పనితనం గురించి #Facebookలో అద్భుతంగా రాసుకొచ్చారో నెటిజన్. ప్రయాణికులను తమ కుటుంబ సభ్యుల్లాగానే ఆర్టీసీ సిబ్బంది భావిస్తారని చెప్పడానికి ఈ పోస్టే నిదర్శనం. నిత్యం పని ఒత్తిడిలోనూ ‘ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే.. అలుపుసొలుపేం ఉన్నది’ అంటూ సిబ్బంది తమ వృత్తి పట్ల అభిరుచిని కనబరుస్తుండటం గొప్ప విషయం. ఏ వృత్తి అయిన రొటీన్‌కి భిన్నంగా ఆస్వాదిస్తూ పని చేస్తే ఎంత ఒత్తిడి అయిన ఇట్టే జయించవచ్చు’ అని ట్వీట్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి