iDreamPost
android-app
ios-app

LKG పిల్లల స్కూల్ ఫీజ్ ఏకంగా రూ.4 లక్షలు! ఈ ఘోరం ఎక్కడో కాదు!

  • Published Feb 16, 2024 | 5:38 PM Updated Updated Feb 16, 2024 | 6:39 PM

School Fee: హైదరాబాద్‌లో ప్రైవేటు స్కూళ్లు పేరెంట్స్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ ప్రముఖ విద్యా సంస్థ అయితే ఎల్‌కేజీ బుడతడికి కూడా నాలుగు లక్ష రూపాయల ఫీజును అడిగింది. ఈ ఫీజులతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

School Fee: హైదరాబాద్‌లో ప్రైవేటు స్కూళ్లు పేరెంట్స్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ ప్రముఖ విద్యా సంస్థ అయితే ఎల్‌కేజీ బుడతడికి కూడా నాలుగు లక్ష రూపాయల ఫీజును అడిగింది. ఈ ఫీజులతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 16, 2024 | 5:38 PMUpdated Feb 16, 2024 | 6:39 PM
LKG పిల్లల స్కూల్ ఫీజ్ ఏకంగా రూ.4 లక్షలు! ఈ ఘోరం ఎక్కడో కాదు!

తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటారు. అందుకోసం వారికి మంచి విద్యను అందించాలని భావిస్తుంటారు. అంతేకాక బేసిక్ నుంచి నాణ్యమైన విద్యను అందిస్తే.. వారి భవిష్యత్ బాగుంటుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే  స్థిరాస్తులు, చరాస్తులు కూడబెట్టుకోవడం కంటే.. బిడ్డల చదువుల కోసం డబ్బులను ఖర్చు చేస్తుంటారు. ఏదో విధంగా కష్టపడి సంపాదిస్తూ పిల్లలను ది బెస్ట్ స్కూల్స్ లో జాయిన్ చేయాలని తాపత్రయ పడుతుంటారు. ఇక పేరెంట్స్ బలహీనతను ప్రైవేటు స్కూల్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని  కొన్ని ప్రైవేటు పాఠశాలల ఫీజుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ స్కూల్ లో అయితే ఏకంగా రూ.4 లక్షలు ఉంది. అయితే  ఏదో పెద్ద క్లాస్ కి అని అనుకుంటే పొరపాటే.. కేవలం ఎల్ కేజీ పిల్లలకే ఈ  ఫీజును వసూలు చేస్తుంది సదరు స్కూల్.

ప్రస్తుతం కాలంలో వివిధ విద్యాసంస్థలు పిల్లల స్కూల్ ఫీజులను విపరీతంగా పెంచేస్తున్నాయి. పెరుగుతున్న ఫీజులను చూసి పేరెంట్స్ కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ నుంచి ఎల్ కేజీ లోకి జాయిన్ అవుతున్న పిల్లాడి ఫీజు విని తల్లిదండ్రులకు గుండెపోటు వచ్చినంత పనైంది. ఏకంగా 65 శాతం ఫీజులు పెంపును అమలు చేసినట్లు ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 2023 విద్యా సంవత్సరంలో సదరు విద్యాసంస్థలో  2.3 లక్షలుగా ఉన్న ఫీజులు, 2024 ఏడాదికి 3.7 లక్షలకు పెంచారు. తీరా చూస్తే  ఈ పిల్లవాడు ఏప్రిల్ లో ఎల్ కేజీలో చేరబోతున్నాడని పేరెంట్స్ వెల్లడించారు. సదరు  పాఠశాల అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఫీజుల పెరుగుదలను సమర్థించుకున్నట్లు తెలిపారు. ఐబీ కరిక్యులమ్ మారడమే ఇందుకు కారణంగా వారు పేర్కొన్నట్లు పేరెంట్స్ చెప్పారు.

ఇంకా మరో అబ్బాయి పేరెంట్స్ మాట్లాడుతూ.. తమ బాబుకు ఎన్ రోల్ చేసినప్పుడు ఫీజు విధానం ఒకటవ తరతగతి వరకైనా మారదని అనుకున్నామని, కానీ, నర్సరీ నుంచి ఎల్‌కేజీలోకి అడుగు పెట్టడానికి స్కూల్ యాజమాన్యం ఫీజులో ఏకంగా 65 శాతం పెంపు చేసిందని తెలిపారు. కాగా, తమ పెద్ద కొడుకు 4వ తరగతి ఇదే స్కూల్లో చదువుతున్నాడని,  వాడికి ఫీజు రూ. 3.2 లక్షలని వివరించారు. తాము పాఠశాలను మార్చాలని భావించినా.. ఇంత తక్కువ సమయంలో స్కూల్‌లో అడ్మిషన్లు దొరకడం కష్టతరంగా మారిందని ఆ పేరెంట్స్ వాపోయారు. ఈ పోస్టు వైరల్ అయింది.

ఇక మరో విద్యార్థి తల్లిదండ్రులు తమ బాధను పంచుకుంటూ ఒకటో తరగతి చేర్చడానికి కూకట్ పల్లి  ప్రాంతంలో చాలా స్కూళ్లు తిరిగామని, అన్నిచోట్ల ఫీజులు ఒక లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ఉందని వివరించారు. ఎందుకు అంత ఫీజు అని ప్రశ్నించగా.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్‌లను చూపిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, పాఠశాలల యాజమాన్యం మాత్రం ఫీజుల పెంపును సమర్థించుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో అన్నింటికి ధరలు పెరుగుతున్నాయని, అనుభవం కలిగిన  టీచర్లను ఉంచుకోవాలంటే తప్పక పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వస్తున్నదని చెబుతున్నాయి.

ఇలా కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా వంటి నగరాల్లో సైతం స్కూళ్ల లక్షల్లో  ఫీజులు ఉంటున్నాయి. మొత్తంగా విద్యార్థుల ఫీజులు.. వారి తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరి.. ఇలా పిల్లల ఫీజులు తల్లిదండ్రులకు గుది బండలుగా మారాయి.  చాలా మందిని ఆర్థికంగా చితికిపోయేందుకు ఈ ఫీజులు కూడా కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి మధ్యతరగతి కుటుంబాల్లో కనిపిస్తుంది. మరి.. ఇలా ఆకాశనంటుతున్న స్కూల్ ఫీజుల ధరల విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet