దంచి కొడుతున్న ఎండలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Orange alert for Those Districts: మార్చి మొదటి వారం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ ఎండలు మండి పోతున్నాయి.

Orange alert for Those Districts: మార్చి మొదటి వారం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ ఎండలు మండి పోతున్నాయి.

ఎండాకాలం వచ్చిందంటే జనాల్లో భయం మొదలవుతుంది. భానుడి ప్రతాపానికి పిట్టాల్లా రాలిపోతుంటారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి మొదలవుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్దులు, చిన్నారుల పరిస్థితి దారుణంగా తయారవుతుంది.  వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ వస్తున్నాయి. అత్యవసర పరిస్థితి ఉంటేనే జనాలు బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్షానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో నేటి నుంచి 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వారం రోజులుగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్ దాటాయి.   రాబోయే ఐదు రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని.. ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాల్పుల ముప్పు ఉండవొచ్చని తెలిపింది. ఇప్పటికే నగరంలో భానుడి ప్రతాపంతో పలువురు వడదెబ్బతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు చల్లని వాతావరణంలో ఉండాలని.. వేసవి తాపాన్ని తగ్గించే పానియాలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎండలు బాగా పెరిగిపోయే ఛాన్సు ఉందని.. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జిగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, మహబూబ్ నటర్ ఇలా పదిహేను జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి 3 నుంచి రాత్రి సమయంలో 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగే ఛాన్సు ఉందని హెచ్చరించారు ఐఎండీ. ఎండ వేడి తగ్గించుకోవడానికి ఎప్పటికప్పుడు చల్లని పానియాలు, కొబ్బరి బోండాలు, వాటర్ మిలన్ లాంటివి కొంటున్నారు జనాలు. వడదెబ్బ తగల కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.

Show comments