iDreamPost
android-app
ios-app

వీడియో వైరల్: లాకప్‌లోనే రీల్స్‌ చేసిన నిందితుడు

  • Published Jul 17, 2024 | 5:57 PM Updated Updated Jul 17, 2024 | 5:57 PM

ఇటీవల కాలంలో యువత రీల్స్ పేరుతో రోడ్లపై, ట్రాఫిక్ ల్లో, మెట్రో ట్రైన్స్ లో, రైల్వే స్టేషన్ లో ఇలా దేన్ని విడిచి పెట్టకుండా పబ్లిక్ లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటి మీద సోయా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు జైల్లో ఉంటూ రీల్స్ చేస్తూ తన అత్యుత్సాహంను ప్రదర్శించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల కాలంలో యువత రీల్స్ పేరుతో రోడ్లపై, ట్రాఫిక్ ల్లో, మెట్రో ట్రైన్స్ లో, రైల్వే స్టేషన్ లో ఇలా దేన్ని విడిచి పెట్టకుండా పబ్లిక్ లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటి మీద సోయా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు జైల్లో ఉంటూ రీల్స్ చేస్తూ తన అత్యుత్సాహంను ప్రదర్శించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jul 17, 2024 | 5:57 PMUpdated Jul 17, 2024 | 5:57 PM
వీడియో వైరల్: లాకప్‌లోనే రీల్స్‌ చేసిన నిందితుడు

ఇటీవల కాలంలో చాలామంది రీల్స్ పేరుతో అసలు ఎక్కడ ఏం చేస్తున్నారో సోయా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమస్ అయ్యి తోపుల్లా నిరూపించుకోవడం కోసం మితిమీరిన పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇన్ స్టాగ్రామ్ దగ్గర నుంచి యూట్యూబ్ వరకు రీల్స్, ప్రాంక్ వీడియోస్ పేరుతో పబ్లిక్ లో ఎక్కడపడితే అక్కడ రెచ్చిపోతున్నారు.అంతేకాకుండా.. ఈ రీల్స్ పేరిట ప్రాణాలు కూడా పొగొట్టుకుంటున్నారు. కాగా, ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో తరుచు రీల్స్ పేరుతో లక్షాల కొలది వీడియోలను మనం చూస్తూ ఉంటాం.

ఇక పబ్లిక్ కూడా ఈ రీల్స్ ను తప్పు పడుతూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి తరుచు కామెంట్స్ చేస్తుంటారు. అయినా సరే యువతలో ఏమాత్రం బెదురు, భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రోడ్లపై, ట్రాఫిక్ ల్లో, మెట్రో ట్రైన్స్ లో, రైల్వే స్టేషన్ లో ఇలా దేన్ని విడిచి పెట్టకుండా యువత రీల్స్ చేసుకంటూ పోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ నిందితుడు ఏకంగా పోలీస్ స్టేషన్ లో రీల్స్ చేస్తూ తన అత్యుత్సాహంను ప్రదర్శించాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే బాలిక కిడ్నాప్‌ కేసులో అరెస్టయి లాకప్‌లో ఉన్న ఓ నిందితుడు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.  ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లాడని హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఓ తల్లి బండ్లగూడ పోలీసులను ఆశ్రయించింది. దీంతో స్థానికంగా ఉంటున్న దస్తగిరి అనే యువకుడే ఈ నేరానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తి చేసిన అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని యువకుడుని అరెస్టు చేశారు కానీ, బాలిక అచూకీని కనిపెట్ట లేకపోయారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో బాలిక తల్లి ఉన్నతాధికారులను ఆశ్రయించింది. దీంతో చేసేదేమీ లేక బండ్లగూడ పోలీసులు దస్తగిరిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు.

ఇక జైల్ లో ఉన్న ఆ యువకుడు తన ఫ్రెండ్స్ సహాయంతో రీల్స్‌ చేస్తూ బాలిక కుటుంబంపై విమర్శలు చేశాడు. ఇక ఈ వీడియోను చూసిన కుటుంబసభ్యులు, పాతబస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. నిందుతుడిని పై చర్యలు తీసుకొకుండా సకాల మర్యదాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా.. పోలీస్ స్టేషన్‌లోనే రీల్స్‌ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అలాగే ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. మరి, జైల్లో ఉన్న నిందితుడు రీల్స్ చేసిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet