P Krishna
Nizamsagar Canal Embankment Broken: భారీ వర్షాలు పడితే చెవులు, కెనాల్స్ పొంగిపొర్లుతుంగటాయి. ఆ సమయంలో కొన్నిసార్లు గండి పడి చుట్టుపక్కల గ్రామాల్లో నీరు వచ్చి చేరుతుంది.
Nizamsagar Canal Embankment Broken: భారీ వర్షాలు పడితే చెవులు, కెనాల్స్ పొంగిపొర్లుతుంగటాయి. ఆ సమయంలో కొన్నిసార్లు గండి పడి చుట్టుపక్కల గ్రామాల్లో నీరు వచ్చి చేరుతుంది.
P Krishna
సాధారణంగా భారీ వర్షాలు పడితే చెరువు, కెనాల్స్ నిండిపోతాయి. నీటి ఉధృతికి చెరువు కట్టలు, కెనాల్స్ తెగిపోతుంటాయి. ప్రస్తుతం తెలంగాణాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా కెనాల్ కట్ట తెగిపోయి ఇండ్లల్లోకి నీరు రావడంతో భయంతో పరుగులు తీశారు జనం. హఠాత్తుగా ఎక్కడ నుంచి నీళ్లు వస్తున్నాయో స్థానికులకు అర్థం కాక అయోమయంలో పడిపాయారు. ఇంకా ఏదైనా పెద్ద ప్రమాదం జరుగుతుందని భావించి భయంతోో వణికిపోయారు. కొంతమంది అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో సోమవారం ఓ సంఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. సోమవారం తెల్లవారు జామున పట్టణ కేంద్రంలోని నిజాం సాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. ఈ కాలువకు ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలో ఒక్కసారిగా నీరు వచ్చి చేరింది. మధ్యరాత్రి ఈ సంఘటన జరగడంతో ఊరిని వరద ముంచేస్తుందని భయంతో ప్రజలు ఇండ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. నీటి ప్రవాహానికి విద్యుత్ స్థంబాలు పడిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
తక్షణమే అధికారులు ఈ ఘటనపై స్పందించిన సహాయక చర్యలు చేపట్టాని డిమాండ్ చేశారు.అయితే నిజాం సాగర్ ప్రాజెక్ట్ ద్వారా చెరువులకు నీరు వదిలే సమయంలో నీటిపారుదల శాఖ అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అదేదీ చేయకుండానే.. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగు నీటి కోసం ప్రాజెక్ట్ అధికారులు కెనాల్ లోకి నీటిని వదిలినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే అందులో చెత్త పేరుకుపోయి ఈ ఘటన జరిగి ఉండవొచ్చని అంటున్నారు గ్రామస్థులు. నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు బాధితులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెగిన నిజాంసాగర్ కెనాల్ కట్ట..
తెల్లవారుజామున నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగటంతో నిజామాబాద్ ఆర్మూర్‌లోని జర్నలిస్ట్ కాలానిలోకి వచ్చిన నీరు, ఇళ్ల నుంచి బయటకి వచ్చిన కాలనీ వాసులు. అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న స్థానికులు.
తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కాలనీ వాసుల డిమాండ్. pic.twitter.com/iFYS7fyzzB
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2024