iDreamPost
android-app
ios-app

ఒకే మహిళ రెండు చోట్ల మృతి చెందింది! ఇలా ఎలా సాధ్యమైందో చూడండి!

  • Published Oct 05, 2024 | 5:30 PM Updated Updated Oct 05, 2024 | 5:30 PM

Nizamabad: ఈ మధ్య కాలంలో డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దమపడుతున్నారు. ముఖ్యండా ప్రభుత్వ అధికారులు కాసులకు కక్కుర్తి పడి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.

Nizamabad: ఈ మధ్య కాలంలో డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దమపడుతున్నారు. ముఖ్యండా ప్రభుత్వ అధికారులు కాసులకు కక్కుర్తి పడి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.

ఒకే మహిళ రెండు చోట్ల మృతి చెందింది! ఇలా ఎలా సాధ్యమైందో చూడండి!

సాధారణంగా ఎవరైనా ఒక చోట చనిపోతుంటారు.. కానీ ఓ మహిళ రెండు చోట్ల చనిపోయింది. వింటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. అదేంటీ ఒక మనిషి ఒక్కసారే చనిపోతారు.. రెండుసార్లు ఎలా సాధ్యం అన్న అనుమానాలు కలుగుతాయి. కానీ, ఓ మహిళ విషయంలో అలానే జరిగింది. అందుకు సాక్ష్యంగా రెండు డెత్‌ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. అయితే.. ఈ వింత ఘటన ఎలా జరిగింది? ఆ మహిళ నిజంగానే రెండు చోట్ల చనిపోయిందా? లేదా ఇందులో ఏదైన తిరకాసు ఉందా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన ఓ మహిళ 2024 ఆగస్టు 10న చనిపోయింది. ఆమె భర్తకు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యల్లో మృతురాలు ఒకరు. మృతురాలికి సంతానం లేరు. కొంత కాలంగా అస్వస్థతకు గురైనా ఆమె సంగారెడ్డి ఆస్పత్రిలో కన్నుమూసింది. తన సోదరి చనిపోయినట్లు ఆగస్టు 12న సంగారెడ్డి మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సంగారెడ్డి మున్సిపల్ ఆగస్టు 17న సదరు మహిళకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే.. భర్త, మరో భార్య కుటుంబానికి చెందిన వారు సెప్టెంబర్ 5న మహమ్మదాబాద్ పంచాయితీలో మరణ ధృవీకణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి సదరు మహిళ మహమ్మదాబాద్ లో మరణించినట్లు సెప్టెంబర్ 25 డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరణ ధృవీకరణ పత్రంలో మృతురాలి భర్త పేరు మార్చారు. మొత్తానికి ఒకే మహిళ రెండు చోట్ల మరణించినట్లు రెండు డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఎకరం భూమి కోసం ఇరు కుటుంబ సభ్యులు అధికారులకు లంచాలు ఇచ్చి తమ పని పూర్తి చేసుకున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఇరు మున్సిపాలిటీ అధికారులు తప్పుడు పత్రాలు జారీ చేయడం కొసమెరుపు. ఇక డెత్ సర్టిఫికెట్స్ తో సదరు మహిళ పేరున ఉన్న ఎకరం భూమిని తమ పేరున పట్టా చేయాలని రెవెన్యూ కార్యాలయం మెట్లు ఎక్కేందుకు రెండు కుటుంబాలు సిద్దమయ్యాయి. మరోవైపు ఈ విషయంపై కొందరు స్థానికులు బాన్సువాడ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.  సంగారెడ్డి జిల్లా, మహమ్మదాబాద్ పంచాయితీల నుంచి జారీ అయిన మరణ ధృవీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.

ఈ విషయం సీరియస్ గా తీసుకున్న అధికారులు  విచారణ చేపట్టారు.   సదరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సమర్పించి మరణ ధృవీకరణ పత్రాలు పొందినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. మృతురాలి పేరున ఉన్న పట్టా భూమిని పట్టా మార్పిడి ఆపాలని తహసీల్దారు కు ఆదేశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. అలాగే డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై చర్యలకు సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడు ఒక్కమహిళ రెండు చోట్ల మృతి అన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకు తెగబడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.