iDreamPost
android-app
ios-app

Nizamabad: మహిళలకు అలర్ట్‌.. స్కానింగ్‌ సెంటర్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త..

  • Published May 28, 2024 | 3:44 PMUpdated May 28, 2024 | 5:39 PM

స్కానింగ్‌ సెంటర్లకు వెళ్లే మహిళలు, యువతులకు కీలక అలర్ట్‌. అక్కడ కూడా కీచకులు కాపు కాసి ఉన్నారు. తాజాగా ఈ తరహా దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

స్కానింగ్‌ సెంటర్లకు వెళ్లే మహిళలు, యువతులకు కీలక అలర్ట్‌. అక్కడ కూడా కీచకులు కాపు కాసి ఉన్నారు. తాజాగా ఈ తరహా దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

  • Published May 28, 2024 | 3:44 PMUpdated May 28, 2024 | 5:39 PM
Nizamabad: మహిళలకు అలర్ట్‌.. స్కానింగ్‌ సెంటర్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త..

అనారోగ్య కారణాలతో .. ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లకు వెళ్తున్నారా.. మరీ ముఖ్యంగా మహిళలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఆరోగ్యం పాడై.. ఆస్పత్రిలో స్పృహ లేని స్థితిలో ఉన్నా సరే కామాంధులు వదలడం లేదు. ఏమాత్రం జాలి, దయ లేకుండా వారి మీద పడి తమ పశువాంఛలు తీర్చుకుంటున్నారు. మృగాళ్లు.. మహిళలను వేధించడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఆస్పత్రులే అనుకుంటే.. ఇప్పుడు స్కానింగ్‌ సెంటర్లు కూడా ఇలాంటి మృగాళ్లుకు అడ్డాలుగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలతో స్కానింగ్‌ కోసం వచ్చిన మహిళపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు కీచకులు. నిజామాబాద్‌లో ఈ తరహా దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు.

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. స్కానింగ్‌ కోసం వచ్చిన మహిళలపై వికృత చేష్టలకు దిగాడో కీచకుడు. స్కానింగ్‌ సమయంలో వారి న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు తీసి.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్కానింగ్ సెంటర్‌కు వచ్చే మహిళలు, యువతులకు తెలియకుండా వారి న్యూడ్ ఫోటోలు, వీడియోలను రికార్డ్‌ చేసేవాడు. ఆ తర్వాత వారిని టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. యువతుల, మహిళల న్యూడ్‌ ఫోటోలు, వీడియోలు వారికి చూపించి.. బెదిరించి, భయపెట్టి తన కామ కోర్కెలను తీర్చుకునేవాడు. గత కొన్నాళ్లుగా ఈ దారుణం కొనసాగుతోంది.

తన మాట వినకుంటే వారి వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించేవాడు. ఇలానే తన స్కానింగ్‌ సెంటర్‌కు వచ్చిన ఓ మహిళ న్యూడ్‌ వీడియోలు తీశాడు. దాన్ని ఆమె మొబైల్‌కి పంపి.. ఆ తర్వాత ఆమెకు కాల్‌ చేశాడు. ఒక్కసారి నీ ఫోన్‌ చెక్‌ చేసుకో అని చెప్పి కట్‌ చేశాడు. తన ఫోన్‌ చెక్‌ చేసుకున్న మహిళ షాక్‌కు గురైంది. తన న్యూడ్ ఫోటోలు రావడంతో భయపడిపోయింది. ఇంతలో మళ్లీ స్కానింగ్‌ సెంటర్‌ ఆపరేటర్‌ నుంచి కాల్ వచ్చింది. తన కోర్కె తీర్చాలని.. కాదని ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు నెట్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు.

ఆ ఫొటోలు చూసి ముందు భయపడ్డ మహిళ.. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని.. పోలీసుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం కాస్త సీరియస్‌ కావడంతో.. దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్‌కు నోటీసు లు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటన నేపథ్యంలో స్కానింగ్‌ సెంటర్లకు వెళ్లాలంటే మహిళలు, యువతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి