nagidream
Nirmal Girl Begging: హృదయవిదారకర సంఘటనలు చూసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. పసిపిల్లలకు దేవుడు ఎందుకు ఇలాంటి రాతలు రాస్తాడా అని అనిపిస్తుంది. తల్లి అంత్యక్రియల కోసం ఓ చిన్నారి బిక్షాటన చేయడం అందరినీ కలచివేస్తుంది.
Nirmal Girl Begging: హృదయవిదారకర సంఘటనలు చూసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. పసిపిల్లలకు దేవుడు ఎందుకు ఇలాంటి రాతలు రాస్తాడా అని అనిపిస్తుంది. తల్లి అంత్యక్రియల కోసం ఓ చిన్నారి బిక్షాటన చేయడం అందరినీ కలచివేస్తుంది.
nagidream
ఈగోలకి పోయి గొడవలు పెట్టుకుని భార్యాభర్తలు విడిపోతారు. దీని వల్ల అభం శుభం తెలియని పిల్లలు తల్లో తండ్రో లేని లోటును ఎదుర్కుంటున్నారు. ఇంకొంతమంది అయితే క్షణికావేశంలో భాగస్వామిని చంపి జైలుకెళ్లడం చేస్తున్నారు. దీని వల్ల పసివాళ్లు అనాథలైపోతున్నారు. తాజాగా ఓ చిన్నారి తండ్రిని, తల్లిని పోగొట్టుకుని దిక్కులేనిదైపోయింది. తండ్రి తమకు దూరంగా జీవిస్తూ కొన్ని రోజుల క్రితం చనిపోగా.. తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీంతో ఆ చిన్నారి ఒంటరిదైపోయింది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన 11 ఏళ్ల చిన్నారికి చిన్న వయసులోనే కష్టాలు మొదలయ్యాయి. కొన్ని నెలల క్రితం చిన్నారి తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. ఇప్పుడు తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ చిన్నారి ఇప్పుడు అనాథగా మిగిలిపోయింది.
తల్లి చనిపోతే బంధువులు ఎవరూ కూడా లేరు. దీంతో తల్లి మృతదేహం వద్ద చిన్నారి ఏం చేయాలో కూడా దిక్కుతోచని స్థితిలో ఉంది. తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలో? అందుకోసం డబ్బులు ఎలా వస్తాయో తెలియక అయోమయంలో పడిపోయింది. చివరకి అటుగా వచ్చిన వారి దగ్గర భిక్షాటన చేయడం మొదలు పెట్టింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేస్తుంది. బెల్తరోడ గ్రామంలో గంగామణి (36) భర్తతో గొడవ పడి కూతురితో కలిసి వేరే చోట నివాసం ఉండేది. అయితే కొన్నాళ్ల క్రితం భర్త అనారోగ్యంతో మరణించాడు. ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ ఉన్నట్టుండి గంగామణి కూడా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయింది. 11 ఏళ్ల చిన్నారిని ఒంటరిని చేసి ఆత్మహత్య చేసుకుంది.
బంధువులు లేరు.. నా అనేవాళ్లు ఎవరూ లేరు. దీంతో తల్లి మృతదేహం పక్కన కూర్చుని బోరున ఏడుస్తుంది ఆ చిన్నారి. చుట్టుపక్కల వారు వచ్చి అంత్యక్రియలు ఎవరు చేస్తారు? ఖర్చులు ఎవరు భరిస్తారు? అని అంటుంటే ఆ మాటలు విన్న చిన్నారి.. భిక్షాటన మొదలుపెట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి అంత్యక్రియల కోసం అక్కడకి వచ్చిన వారి దగ్గర భిక్షాటన చేసింది. తల్లి మృతదేహం పక్కన ఒక చిన్న గుడ్డ పరిచి సాయం చేయమని వేడుకుంది. చిన్నారి దీనస్థితి గురించి చూసినవాళ్లు మాట్లాడుకుంటుంటే అది తెలిసిన స్థానికులు చిన్నారి దగ్గరకు వెళ్లి ఆర్థిక సాయం అందించారు. ఆత్మహత్య కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కోసం వచ్చి పాప పరిస్థితి చూసి ఆర్థిక సాయం అందించారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా స్పందించి చిన్నారికి ఆర్థిక సాయం చేశారు. స్థానికులు అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.