iDreamPost
android-app
ios-app

బిగ్‌ అలర్ట్‌! వచ్చే 5 రోజులు చాలా డేంజర్‌.. బయటికి వెళ్లకండి!

  • Published Mar 24, 2024 | 1:59 PM Updated Updated Mar 24, 2024 | 1:59 PM

మొన్నటి వరకు రాష్ట్రంలో అకాల వర్షలతో నగరవాసులకు చల్లటి వాతవరణంతో కొంత ఉపమశమనం లభించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో చల్లటి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఆస్వాధిస్తున్న రాష్ట్ర ప్రజలకు పిడుగు లాంటి వార్త అందింది. రానున్న 5 రోజుల్లో నగరంలో డేంజర్ అలార్ట్ ను జారీ చేశారు.

మొన్నటి వరకు రాష్ట్రంలో అకాల వర్షలతో నగరవాసులకు చల్లటి వాతవరణంతో కొంత ఉపమశమనం లభించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో చల్లటి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఆస్వాధిస్తున్న రాష్ట్ర ప్రజలకు పిడుగు లాంటి వార్త అందింది. రానున్న 5 రోజుల్లో నగరంలో డేంజర్ అలార్ట్ ను జారీ చేశారు.

  • Published Mar 24, 2024 | 1:59 PMUpdated Mar 24, 2024 | 1:59 PM
బిగ్‌ అలర్ట్‌! వచ్చే 5 రోజులు చాలా డేంజర్‌.. బయటికి వెళ్లకండి!

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రల్లో భగ భగ మంటు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆ ఎండల తీవ్రత నుంచి కాస్త ఊరటనిస్తూ గత వారం రోజులుగా వాతవరణం అంత చల్లబడింది. ముఖ్యంగా తెలంగాణలోని మొన్నటి వరకు అకాల వర్షలతో.. నగరవాసులకు చల్లటి వాతవరణంతో కొంత ఉపశమనం లభించించి. అయితే బంగాళాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా.. వారం రోజుల పాటు ఎండలు తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టాయి. అలాగే నగరంలో సాయంత్రం అయితే చల్లని గాలులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఆస్వాధిస్తున్న నగరవాసులకు.. ఓ పిడుగు లాంటి వార్త వినిపించింది. రాష్ట్రంలో మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇక నుంచి రాష్ట్రంలో వస్తున్న 5 రోజులు డేంజర్ అలార్ట్ ను జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు అకాల వర్షాల కారణంగా చల్లటి వాతవరణంతో ప్రజలకు ఉపశమనం కలిగించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. కాగా, రాష్ట్రంలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజాగా ఓ ప్రకటన వెల్లడించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అయితే దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీయడం వల్ల వచ్చే 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని తెలిపింది.

ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో భానుడు భగభగ మండిపోతున్నాడు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో శనివారం 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా కల్హేర్లో 38.7 డిగ్రీలు, మెదక్ జిల్లా శివ్వంపేటలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే పెరుగనున్న ఎండలపై అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశామని ఐఎండీ చెప్పగా.. హైదరాబాద్‌లోనూ వచ్చే 5 రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. అలాగే పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దీంతో పాటు మధ్యాహ్న సమయాల్లో ప్రజలు అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. కాగా, రాత్రి పూట సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. ఇక ఎండలో బయటకు వెళ్లేవారు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.