తెలంగాణ.. కొత్త ట్రాఫిక్ రూల్స్! అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే!

Telangana New Traffic Rules & Fines: నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠినమైన రూల్స్ తెస్తూనే ఉంది.. కానీ వాహనదారులు వాటిని ఎప్పూటికప్పుడు అతిక్రమిస్తున్నారు.

Telangana New Traffic Rules & Fines: నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠినమైన రూల్స్ తెస్తూనే ఉంది.. కానీ వాహనదారులు వాటిని ఎప్పూటికప్పుడు అతిక్రమిస్తున్నారు.

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినతరం చేసినా, చలాన్లు విధించినా వాహనదారులు  వాటిని అతిక్రమిస్తూ చేస్తున్న తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నియమాలు కఠినతరం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో తొలి కేసు హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయింది. సదరు వాహనదారుడు నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపినందుకు అతడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 281, 80(ఏ), 177 మోటర్ వెహికిల్ చట్టం కింద కేసు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు.  తాజాగా తెలంగాణలో వచ్చిన కొత్త రూల్స్.. వాటిని అతిక్రమిస్తే పడే జరిమానాలు ఏంటో తెలుసుకుందాం.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు :

  • రెడ్ లైట్ సిగ్నల్ నిబంధన ఉల్లంఘన :
    – గతంలో జరిమానా : రూ. 100
    – ప్రస్తుతం జరిమానా : రూ.500
  • సాధారణ ఉల్లంఘన :
    – గతంలో జరిమానా : రూ.100
    – ప్రస్తుం జరిమానా : రూ.500
  • లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం :
    – గతంలో జరిమానా : రూ.500
    – ప్రస్తుతం జరిమానా : రూ.2000
  •  అథారిటీ రూల్స్ అతిక్రమించడం :
    – గతంలో జరిమానా : రూ.500
    – ప్రస్తుతం జరిమానా : రూ.2000
  •  అతివేగంగా వాహనాలు నడపడం :
    – గతంలో జరిమానా : రూ.400
    – ప్రస్తుతం జరిమానా : రూ.1000
  • మద్యం సేవించి వాహనాలు నడపడం:
    – గతంలో జరిమానా : రూ.2000
    – ప్రస్తుతం జరిమానా : రూ.10000
  •  ప్రమాదకరంగా వాహనాలు నడపడం:
    – గతంలో జరిమానా : రూ.2000
    – ప్రస్తుతం జరిమానా : రూ.5000
  • హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం :
    – గతంలో జరిమానా : రూ.100
    – ప్రస్తుతం జరిమానా : రూ.1000 తో పాటు 3 నెలలకు లైసెన్స్ రద్దు
  •  రేసింగ్, హై స్పీడ్ తో వాహనాలు నడపడం:
    – గతంలో జరిమానా : రూ.500
    – ప్రస్తుతం జరిమానా : రూ.5000
  •  సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం:
    – గతంలో జరిమానా : రూ.100
    – ప్రస్తుతం జరిమానా : రూ.1000
  •  ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయడం :
    – ప్రస్తుతం జరిమానా : రూ.1200
  •  అత్యవసర వాహనాలను నిరోధించడం :
    – ప్రస్తుతం జరిమానా : రూ. 10,000
  • ద్విచక్రవాహనాలపై హెవీ లోడ్ :
    – గతంలో జరిమానా : రూ.100
    – ప్రస్తుతం జరిమానా : రూ.1200 తో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు
  • ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపడం :
    – గతంలో జరిమానా : రూ.1000
    – ప్రస్తుతం జరిమానా : రూ.2000
Show comments