P Krishna
Traffic Rules: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Traffic Rules: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
P Krishna
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే తప్పిదాలకు ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎంత చెబుతున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తెలంగాణలో సగటున రోజుకు పది నుంచి ఇరవై మంది వరకు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం రోడ్డు నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో కొంత కాలంగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారుల లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా శాఖ ఆదాయ మార్గాలు పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే మోటారు వాహన చట్టం కింద లైసెన్స్ రద్దు చేయాలని అన్నారు.
ఇటీవల కరీంనగర్ లో వివాదాస్పదం అయిన ఇసుక, ఫ్లేయాష్ ల ఓవర్ లోడ్ కు సంబంధించి తనిఖీలను విస్తృతం చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అంతేకాదు వాటిపై విచారణ చేపట్టి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలాని సూచించారు. ఇక విద్యా సంస్థలకు చెందిన బస్సుల ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. ఆటోలో విద్యార్థులను ఓవర్ లోడ్ తో తీసుకు వెళ్లే డ్రైవర్లపై కేసు నమోదు చేయాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనల విషయంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.