iDreamPost
android-app
ios-app

ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కష్టమే.. అమల్లోకి కొత్త టెస్ట్

  • Published Jul 13, 2024 | 9:38 PM Updated Updated Jul 13, 2024 | 9:38 PM

Now It Is Very Hard To Get Driving Licence, RTA Officers Implements New Test: ఒక ఏజెంట్ ని పట్టుకుని.. డబ్బులిచ్చి అధికారులని మేనేజ్ చేసి డ్రైవింగ్ లైసెన్సులు తెచ్చుకుంటున్నారు చాలా మంది. అయితే అవగాహన లేని వాళ్ళు, డ్రైవింగ్ రాని వాళ్ళు లైసెన్స్ లతో రోడ్డెక్కడం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీన్ని అరికట్టేందుకు అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ని అంత సులువుగా పొందలేరు.

Now It Is Very Hard To Get Driving Licence, RTA Officers Implements New Test: ఒక ఏజెంట్ ని పట్టుకుని.. డబ్బులిచ్చి అధికారులని మేనేజ్ చేసి డ్రైవింగ్ లైసెన్సులు తెచ్చుకుంటున్నారు చాలా మంది. అయితే అవగాహన లేని వాళ్ళు, డ్రైవింగ్ రాని వాళ్ళు లైసెన్స్ లతో రోడ్డెక్కడం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీన్ని అరికట్టేందుకు అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ని అంత సులువుగా పొందలేరు.

ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కష్టమే.. అమల్లోకి కొత్త టెస్ట్

కొంతమంది ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన లేకుండానే అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నారు. డ్రైవింగ్ సరిగా రాకపోయినా కూడా కొంతమంది లైసెన్స్ లు పొందుతున్నారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీఏ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను అప్డేట్ చేయాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. అడ్డదారుల్లో డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుని ప్రమాదాలకు కారణమవుతున్నారని కొత్త పరీక్షను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ ఉన్న మ్యాన్యువల్ పరీక్షను తీసేసి కొత్త పరీక్షను తీసుకొచ్చారు.

మ్యాన్యువల్ పరీక్ష విధానం కంటే మెరుగైన ప్రామాణిక డ్రైవింగ్ టెస్ట్ ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీని కోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ని నిర్వహించాలని చూస్తున్నారు. ఈ డ్రైవింగ్ టెస్టులో భాగంగా టెస్ట్ ట్రాక్స్ పై.. హైదరాబాద్ రోడ్లపై నిత్యం ఎదురయ్యే ఇబ్బందులను కృత్రిమంగా సృష్టిస్తారు. అంటే సిగ్నల్ లైట్స్, రద్దీ వంటి వాటిని కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు. ఇంతకు ముందు వరకూ సిగ్నల్ లైట్స్ గురించి అవగాహన ఉందో లేదో అని కంప్యూటర్ టెస్ట్ పెట్టేవారు. అయితే లంచం ఇచ్చి ఆ టెస్టుని అధికారులతో రాయించేసేవారు. అలా అడ్డదారిలో లైసెన్స్ పొందేవారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన ఆర్టీఏ అధికారులు.. మ్యాన్యువల్ టెస్ట్ బదులు కొత్త టెస్ట్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

డ్రైవింగ్ వచ్చో లేదో, రోడ్ల మీద, ట్రాఫిక్ సిగ్నల్స్ మీద అవగాహన ఉందో లేదో అని ఈ టెస్ట్ తో తెలిసిపోతుంది. కృత్రిమ టెస్ట్ ట్రాక్స్ లో ఈ ఇబ్బందులను  ఎదుర్కొని ఎవరైతే తడబడకుండా డ్రైవింగ్ చేసి టెస్టులో పాస్ అవుతారో వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఈ టెస్ట్ ట్రాక్ మీద వాహనం నడుపుతున్నప్పుడు ఇదంతా కంప్యూటర్ లో రికార్డ్ అవుతుంది. ఏ చిన్న తప్పు చేసినా టెస్ట్ ఫెయిలైనట్టే. మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవాల్సిందే. అవగాహన లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందామంటే ఇక నుంచి కుదరదు.

కొత్త టెస్ట్ ఇలా ఉంటుంది:

  • ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులో 5 ట్రాక్స్ ఉంటాయి. 
  • హెచ్ ట్రాక్ లో ఆర్టీఏ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాన్ని రివర్స్ చేయాలి. 
  • ఎస్ ట్రాక్ లో ఒక మూల నుంచి మరో మూలకు వాహనాన్ని తిప్పాలి. 
  • మలుపులు, ఎత్తైన ప్రదేశాలు, చిన్న చిన్న లోయలు, ఎత్తుపల్లాలు ఉన్న కే ట్రాక్ లో వాహనాన్ని నడపాలి. ఫైనల్ గా బండిని పార్క్ చేసి చూపించాలి. 
  • ఈ టెస్టులో భాగంగా టూవీలర్స్ హెల్మెట్, ఫోర్ వీలర్స్ సీటు బెల్ట్ పెట్టుకోవాలి. 
  • ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్ లో రికార్డ్ అవుతుంది. 
  • ఈ క్రమంలో ఏదైనా పొరపాటు చేస్తే టెస్ట్ లో ఫెయిల్ అవుతారు. 
  • ఫెయిల్ అయితే నెల రోజులు శిక్షణ తీసుకుని రావాల్సి ఉంటుంది. 
  • ఈ కొత్త టెస్ట్ తో అధికారులను గానీ, సిబ్బందిని గానీ మేనేజ్ చేయడానికి కుదరదు. 
  • లైసెన్స్ పొందడం అంత సులువు కాదు