iDreamPost
android-app
ios-app

కొత్త రేషన్‌ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్!

  • Published Sep 20, 2024 | 9:21 AM Updated Updated Sep 20, 2024 | 9:21 AM

CM Revanth Reddy on New Ration Card: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్త రేషన్ కార్డుదారులకు గొప్ప శుభవార్త చెప్పారు.

CM Revanth Reddy on New Ration Card: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్త రేషన్ కార్డుదారులకు గొప్ప శుభవార్త చెప్పారు.

కొత్త రేషన్‌ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్!

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పదేళ్ల పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లింది. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అమలు చేశారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేశారు. తాజాగా కొత్త రేషన్ కార్డుదారులకు అదిరిపోయే వార్త చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇందులో భాగంగానే గురువారం కొత్త రేషన్ కార్డు గురించి కీలక వివరాలను వెల్లడించారు. తెలంగాణలో కొత్త కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపారు. రేషన్ కార్డుల జారీ కోసం విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర్ రాజనర్సింహలతో కలిసి సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ విషయాలు వెల్లడంచారు. రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను కోరారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందేలా చూడాలని ఆదేశించారు.

తెలంగాణలో రేషన్ కార్డుల విధివిధానాలు, డిజిటల్ కార్డుల విషయంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించి అర్హుల ఎంపిక, హెల్త్ కార్డుల జారీ వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డులను ప్రామాణికంగా మార్చడంతో కొత్త రేషన్ కార్డుల కోసం నిరుపేదలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో అనర్హులకు రేషన్ కార్డులు దక్కడంపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం.  ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాలు అమలుపై ఫోకస్ పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ త్వరలో అర్హులైన మహిళలకు రూ.2500 ఇవ్వనున్నట్లు తెలిపింది.