Keerthi
రాను రాను సమాజంలో మాతృత్వం మంటకలిసిపోతుంది. నవ మాసాలు మోసి కన్న బిడ్డను పొత్తిళ్ల నుంచే దూరం చేసుకుని అమ్మ తనానికి వన్నె తెచ్చే ఘటనలు ఇటీవలే కాలంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా అప్పుడే పుట్టిన ఓ పసికందు పై ఆ తల్లి చేసే నిర్వాకం చూసి స్థానికులు కంటతడిపెట్టారు. అసలు ఏం జరిగిదంటే..
రాను రాను సమాజంలో మాతృత్వం మంటకలిసిపోతుంది. నవ మాసాలు మోసి కన్న బిడ్డను పొత్తిళ్ల నుంచే దూరం చేసుకుని అమ్మ తనానికి వన్నె తెచ్చే ఘటనలు ఇటీవలే కాలంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా అప్పుడే పుట్టిన ఓ పసికందు పై ఆ తల్లి చేసే నిర్వాకం చూసి స్థానికులు కంటతడిపెట్టారు. అసలు ఏం జరిగిదంటే..
Keerthi
మాతృత్వం అంటే ప్రాణం పోసేది కానీ, ప్రాణం తీసేది కాదు. అలాంటి అమ్మ తననికి వన్నె తెచ్చే ఘటనలు ఇటీవలే కాలంలో చాలా చూస్తూన్నం. నవ మాసాలు మోసి కన్న బిడ్డను పొత్తిళ్ల నుంచే దూరం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. కంటే అమ్మ విలువ తెలుస్తోంది అంటారు. మరి అలాంటి మాతృమూర్తి ప్రేమ నేడు మలీనమవుతోంది. ఈ ప్రపంచంలో తల్లి పాత్ర, తల్లి ప్రేమ చాలా విలువైనవి. మరి అలాంటి పేగు బంధాన్ని మరిచిపోయేలా సమాజం మారిపోతుంది. రోజురోజుకి మానవత్వం అంతరించిపోతుంది. కాలంలో వచ్చిన మార్పులాగా అమ్మ ప్రేమలో కూడా మార్పులు వచ్చాయా అనిపించేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మాతృత్వం సిగ్గుపడేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. తాజాగా అప్పుడే పుట్టిన ఓ పసికందు పై ఆ తల్లి చేసే నిర్వాకం చూసి స్థానికులు కంటతడిపెట్టారు. అసలు ఏం జరిగిదంటే..
ఇంకా లోకం కూడా చూడని ఓ పసికందు పై ఆ కన్నతల్లి కర్కషంగా ప్రవర్తించింది. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ పై మాతృత్వం సిగ్గుపడేలా చేసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును ముళ్లపొదల్లో పడేసిన ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. అసలు ఆ బిడ్డ ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో..? ఎవరు పడేసారే కూడా తెలియదు. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికుల కంట ముళ్లపొదల్లో పడివున్న ఆ పసికందు కనిపించింది. రక్తస్రావంలో ఉన్న ఆ చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ స్థితిలో పసికందును చూసిన స్థానికులు చలించిపోయారు.
వెంటనే ఆ మగ శిశువును అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటారు. అలాగే స్థానిక అంగన్వాడి టీచర్ కు సమాచారం అందించారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు సంఘటన స్థాలానికి చేరుకొని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పుడే పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఇలా ఎవరు, ఎందుకు ముళ్ల పొదల్లో పడేసి ఉంటారని అని ఆ ప్రాంతమంతా చర్చాంశనీయంగా మారింది. కాగా, ఆ శిశువు గ్రహణం మోర్రితో పుట్టినందుకే ముళ్ల పొదల్లో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కొండమల్లేపల్లి ప్రాంతంలోని ఆసుపత్రుల్లో డెలివరీ అయిన మహిళల వివరాలను సేకరిస్తున్నారు. మరి, అప్పుడే పుట్టిన పసికందును అలా ముళ్లపొదల్లో పడేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.