Dharani
Trolls On Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బర్రెలక్కని తాజాగా విమర్శిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు..
Trolls On Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బర్రెలక్కని తాజాగా విమర్శిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు..
Dharani
బర్రెలక్క.. ఈ పేరు తెలియని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదు. మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి మాత్రమే ఆమె తెలుసు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వల్ల బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఎన్నికల్లో ఆమె కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలవడం సంచలనంగా మారింది. ఈ ఎన్నికల్లో ఆమె నిరుద్యోగుల తరఫున నామినేషన్ వేసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరో బర్రెలక్కకు మద్దతుగా నిలిచారు.
అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. కానీ జనాలు మాత్రం ఎన్నికల ఫలితాల వేళ.. బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకోవడానికి విపరీతమైన ఆసక్తి చూపారు. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ నుంచి ఆమె అఫిడవిట్‌ను సుమారు లక్ష మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే.. ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఎన్నికల్లో బర్రెలక్కకు 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
ఎన్నికల వేళ పోటిలో నిలిచిన బర్రెలక్కను ప్రశంసించిన నెటిజనులు.. తాజాగా ఆమెపై విమర్శలు చేస్తున్నారు. బర్రెలక్క నువ్వు ఇలాంటి పనులు చేసుకునే బదులు బర్లు కాసుకో అని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది.. ఎందుకు ఆమెను విమర్శిస్తున్నారు అంటే.. తాజాగా బర్రెలక్క సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. దీనిలో ఆమె జ్యోతిష్యం చెప్పే ఓ గురువు గారించి చెబుతూ పోయింది.
ఎవరికైనా సమస్యలుంటే.. గురువు గారిని సంప్రదించాలంటూ.. నంబర్ కూడా ఇచ్చింది. అంతేకాక చాలా మంది గురువు గారికి కాల్ చేసి.. తన నంబర్ ఇవ్వమని అడుగుతున్నారని చెప్పుకొచ్చింది శిరీష. ఈ వీడియో మీద ప్రత్యేక వశీకరణ స్పెషలిస్ట్ అంటూ ఓ ప్రోమో కూడా కనిపించింది.
ఇక ఈ వీడియో చూసిన జనాలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విజిల్ గుర్తు మీద పోటీ చేసి.. విజిల్ బ్లోయర్‌లా అందరికి ఆదర్శంగా నిలిచిన బర్రెలక్క.. ఇప్పుడిలా ఓ జ్యోతిష్యుడిని ప్రమోట్ చేయడం నిజంగానే తమను షాక్‌కు గురి చేసింది అంటున్నారు. నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకున్నారు. అలాంటిది ఇలాంటి వారిని ప్రమోట్ చేయడం ఏంటి.. మరి నువ్వు ఎన్నికల్లో ఎప్పుడు గెలుస్తావ్, నీకు జాబ్ వస్తుందా, రాదా అని మీ గురువు గారిని అడుగు.. నువ్వు ఇలాంటి పనికి మాలిన పనులు చేయడం కన్నా.. బర్లు కాసుకోవడం మేలు అని ట్రోల్ చేస్తున్నారు.
డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడం బర్రెలు కాసుకుంటున్నానంటూ.. గతంలో శిరీష పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అయ్యింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఆమెపై కేసు పెట్టింది. అయినా వెనక్కి తగ్గని శిరీష.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. వేలాది మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన శిరీష.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. విజయం సాధించే వరకు.. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చింది. అలాంటిది.. ఇప్పుడు ఇంత సడెన్‌గా గురువు గారు అంటూ ఎవరో జ్యోతిషుడిని ప్రమోట్ చేయడాన్ని నెటిజనులు తప్పుపడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు.
బర్రెలక్క 👌 pic.twitter.com/V0vzdTXpqN
— Actual India (@ActualIndia) January 23, 2024
#బర్రెలక్క ఈసారి ఎంపి ఎలక్షన్ లో గురువుగారిని ప్రచారంలో పాల్గొనేవిధంగా చూడాలి.
ప్రతి బూత్ లో స్వామి పూజ చేసిన నిమ్మకాయలు ఉంచాలి.
ఓటర్ లిస్టు తీస్కొని వశికరణం చేపియ్యాలి.
అవసరం అయితే @VVL_Official సార్ కు గురువుగారిని పరిచయం చెయ్యాలి. @RGVzoominhttps://t.co/kKDUN6iosG— גדוואל דבנדר (@gn_devendar) January 22, 2024