నెల రోజుల క్రితం నేపాల్‌లో వివాహం.. హైదరాబాద్‌లో కాపురం.. ఇంతలోనే

నెల రోజుల క్రితమే ఆమెకు వివాహం అయ్యింది. భర్తతో కలిసి హైదరాబాద్‌ వచ్చింది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

నెల రోజుల క్రితమే ఆమెకు వివాహం అయ్యింది. భర్తతో కలిసి హైదరాబాద్‌ వచ్చింది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఆలోచనల్లో స్థిరత్వం లేకపోతే జీవితం ముందుకు సాగడం అంత తేలిక కాదు. మనసు ప్రశాంతంగా ఉండి.. ఆలోచనలు స్థిరంగా ఉంటే.. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా.. సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందుకుసాగుతారు. మనోసంకల్పం ధృడంగా ఉంటే చాలు.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చు. అది లేకపోతే చిన్న చిన్న సమస్యలు సైతం మనల్ని కుంగదీస్తాయి. ఆ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు జీవితాన్ని బలి తీసుకుంటాయి. చిన్న చిన్న సమస్యలకే భయపడి.. ఆత్మహత్య చేసుకోవడం, ఇంటి నుంచి వెళ్లిపోవడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం వివాహం చేసుకుని నగరానికి వచ్చిన ఓ నవ వధువు.. అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అసలేం జరిగింది అంటే..

నెల రోజుల క్రితమే వివాహం చేసుకుని.. భర్తతో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన నేపాల్‌ మహిళ.. అదృశ్యం అవ్వడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళ కోసం గాలిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌ బ్లూ ఫాక్స్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేసే నేపాల్‌కి చెందిన సోను తాప అనే వ్యక్తికి నెల రోజుల క్రితం వివాహం జరిగింది. నేపాల్‌లోని తన పక్క గ్రామం అంజ్‌కోట్‌కు చెందిన ఊర్మిళ (22) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని రోజులకే ఉపాధి నిమిత్తం భార్య ఊర్మిళతో కలిసి హైదరాబాద్‌ వచ్చాడు సోను.

ఈక్రమంలో నగరంలోని హిమాయత్‌నగర్‌లోని ఉర్దూ హాల్‌ లేన్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు సోను తాప. ఇలా ఉండగా.. నాలుగు రోజుల క్రితం.. అనగా ఈ నెల 9వ తేదీన మధ్యహ్నం 2 గంటల సమయంలో భర్త సోను డ్యూటీకి వెళ్తుండగా ఊర్మిళ ఈ రోజు డ్యూటీ వెళ్లవద్దని చెప్పింది. కానీ సోను ఊర్మిళ మాట వినకుండా డ్యూటీకి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో భార్య ఊర్మిళ తాను తన అమ్మగారి ఇంటికి నేపాల్‌కి తిరిగి వెళ్లిపోతున్నట్లు భర్తకు మెసేజ్‌ చేసింది.

మెసేజ్‌ చూసిన వెంటనే ఇంటికి వచ్చిన సోనుకి భార్య ఊర్మిళ కనిపించలేదు. దాంతో నిజంగానే ఆమె నేపాల్‌ వెళ్లిందని అనుకున్నాడు. అయితే ఊర్మిళ ఇంటి నుంచి వెళ్లి రెండు రోజులు గడుస్తున్నా ఆమె నుంచి ఎలాంటి కాల్‌ రాలేదు. దాంతో సోనుకి అనుమానం వచ్చి.. ఊర్మిళ తల్లికి కాల్‌ చేశాడు. కానీ ఆమె లిఫ్ట్‌ చేయడం లేదు. దాంతో అసలు ఊర్మిళ నేపాల్‌కి వెళ్లిందా లేదా అనే అనుమానంతో.. పోలీసులును ఆశ్రయించాడు సోను. ఈ క్రమంలో నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌కుమార్‌ తెలిపారు.

Show comments