iDreamPost
android-app
ios-app

టూరుకు వెళ్లి కారడవిలో చిక్కిన 82 మంది.. 8 గంటల నరకం తర్వాత!

టూరుకు వెళ్లి కారడవిలో చిక్కిన 82 మంది.. 8 గంటల నరకం తర్వాత!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలపాతాలు సైతం కొత్త శోభను సంతరించుకున్నాయి. ములుగు జిల్లాలోని ముత్యంధార జలపాతాలు వర్షాల కారణంగా కలకల్లాడుతున్నాయి. దీంతో పర్యాటకులు ఆ జలపాతాలను చూసేందుకు క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముత్యంధార జలపాతాలను చూడ్డానికి వెళ్లిన 82 మంది పర్యాటకులు కారడవిలో చిక్కుకుపోయారు. బయటపడే మార్గం లేక.. దాదాపు 8 గంటల పాటు నరకం అనుభవించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల రాకతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే..

బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 82 మంది పర్యాటకులు ములుగు జిల్లాలోని ముత్యంధార జలపాతాలను చూడ్డానికి వెళ్లారు. జలపాతంలో ఈత కొడుతూ బాగా ఎంజాయ్‌ చేశారు. అయితే, జలపాతాలనుంచి తిరిగి వచ్చే సమయంలో వారు కారడివిలో చిక్కుకుపోయారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాల్వల కారణంగా మధ్యలోనే చిక్కుకుపోయారు. సహాయం కోసం అరవటం మొదలుపెట్టారు. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. మొత్తం 82 మంది ఉండగా వారిలో కేవలం ఇద్దరి ఫోన్లు మాత్రమే పని చేశాయి. ఈ విషయాన్ని వారు మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రోప్‌ సహాయంతో వాగుల్ని దాటుకుని లోపలకి వెళ్లారు. లోపల చిక్కుకున్న 82 మందిని బయటకు తీసుకువచ్చారు. దాదాపు 8 గంటల నరకం తర్వాత వారు అడవిలోనుంచి బయటపడ్డారు. వీరభద్రవరం చేరుకున్న 82 మంది అక్కడే భోజనాలు చేశారు. అనంతరం సొంత గ్రామాలకు ప్రయాణం అయ్యారు. మరి, ముత్యంధార జలపాతాలు చూడ్డానికి వెళ్లి కారడవిలో 8 గంటల నరకం అనుభవించిన 82 మంది పర్యాటకుల ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి