Dharani
సాధారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు పోలీసులు లాఠీ చార్జీ చేస్తుంటారు. కానీ తాజాగా ఓ చోట అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. పోలీసులపై ప్రజలు రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఎందుకంటే..
సాధారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు పోలీసులు లాఠీ చార్జీ చేస్తుంటారు. కానీ తాజాగా ఓ చోట అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. పోలీసులపై ప్రజలు రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఎందుకంటే..
Dharani
సాధారణంగా పోలీసులను చూసి.. జనాలు భయపడతారు. వారి దరిదాపులకు పోవాలంటేనే జడుసుకుంటారు. ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా సరే.. నేటికి కూడా మన సమాజంలో ఖాకీలంటే చాలా మంది భయపడతారు. కానీ పరిస్థితి విషమిస్తే.. ప్రజలు కూడా పోలీసులపై తిరగబడి.. దాడి చేస్తారు. ఇక తాజాగా ఓ చోట ఇలాంటి ఉద్రిక్త పరిస్థితే ఎదురయ్యింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు.. పోలీసులపై కట్టెలు, రాళ్లతో దాడి చేశారు. పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన నారాయణపేట జిల్లాలోని చిత్తనూర్ గ్రామంలో ఆదివారం నాడు చోటు చేసుకుంది. ఈ గ్రామానికి సమీపంలో ఆగ్రో ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది. అయితే దీని నుంచి విడుదలయ్యే వ్యర్థాలను చిత్తనూరు గ్రామానికి సమీపంలో వాగులో పారబోసేందుకు ఓ ట్యాంకర్ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ఏక్లాస్ పూర్, చిత్తనూరు గ్రామాల ప్రజలు ఈ ట్యాంకర్‌ను అడ్డుకున్నారు. వ్యర్థాలను శుద్ది చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోకుండా.. వాటిని తీసుకువచ్చి తమ గ్రామాల సమీపంలోని వాగులు, ఖాళీ స్థలాల్లో వేయడం వల్ల తమ పంటలు, చెరువుల్లోని నీరు కలుషితం అవుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును కూడ తాము వ్యతిరేకించిన విషయాన్ని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.
గ్రామానికి సమీపంలోని వ్యర్థాలను డంప్ చేసేందుకు వచ్చిన ట్యాంకర్‌ను రెండు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. వ్యర్థాలను తమ గ్రామ సమీపంలో ఉన్న వాగులో వేయవద్దని కోరారు. ఈ విషయమై గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దాంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. పోలీసులపై తిరగబడ్డారు. ఈ క్రమంలో గ్రామస్థుల దాడిలో మక్తల్ సీఐ రాంలాల్ గాయపడ్డారు. పోలీస్ వాహనానికి గ్రామస్తులు నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులపై గ్రామస్తుల పై కట్టెలు, రాళ్లతో దాడి
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఉన్న జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాలను ట్యాంకర్ ద్వారా బయటకు తీసుకెళ్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
పోలీసులు ఆందోళనకారులని చెదరకొడుతున్న క్రమంలో ఆగ్రహించిన గ్రామస్థులు కట్టెలు, రాళ్లతో… pic.twitter.com/aWV1onkn9w
— Telugu Scribe (@TeluguScribe) October 22, 2023