రెవెన్యూ అధికారి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు! మొత్తం ఎన్ని కోట్లంటే?

ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పని చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం అక్రమ సంపాదనకు అలవాటు పడి.. అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అవినీతి తిమింగళాలు ఏసీబీ అధికారుల వలకు చిక్కగా తాజాగా మరో ప్రభుత్వ అధికారి పట్టుబడ్డారు. నోట్ల కట్టలుగా ఆ అధికారి ఇంట్లో దర్శనమిచ్చాయి.

ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పని చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం అక్రమ సంపాదనకు అలవాటు పడి.. అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అవినీతి తిమింగళాలు ఏసీబీ అధికారుల వలకు చిక్కగా తాజాగా మరో ప్రభుత్వ అధికారి పట్టుబడ్డారు. నోట్ల కట్టలుగా ఆ అధికారి ఇంట్లో దర్శనమిచ్చాయి.

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అంటే ప్రజల సమస్యలు తెసుకుంటూ సర్వీస్ చేయాలి. అలానే ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పని చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం అక్రమ సంపాదనకు అలవాటు పడి.. అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అవినీతి తిమింగళాలు ఏసీబీ అధికారుల వలకు చిక్కగా తాజాగా మరో ప్రభుత్వ అధికారి పట్టుబడ్డారు. ఆయన దగ్గర చిక్కిన డబ్బులు చూసి అందరూ షాకయ్యారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో చోటుచేసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ మున్సిప్ కార్యాలంయలో దాసరి నరేందర్ అనే వ్యక్తి సూపరింటెండెండ్ గా పని చేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం వెళ్లింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన ఇంటిపై ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. దాసరి నరేందర్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులే షాక్ అయ్యే ఆస్తులు బయటపడ్డాయి. ఆ ప్రభుత్వ అధికారి ఇంట్లో..  ఆయన బంధువుల ఇళ్లల్లో ఏకంగా 2.93 కోట్ల డబ్బు బయటపడింది.  తనిఖీల్లో బయటపడిన డబ్బుల కట్టలు కట్టి.. గుట్టలుగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ నోట్ల కట్టలు చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులు షాకయ్యారు. దాసరి నరేందర్ బ్యాంక్ అకౌంట్లో కోటి 10 లక్షల రూపాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇంట్లోనే బీరువాల్లో అర కేజీ బంగారం, స్థిరాస్తులకు సంబంధించి 17 కీలక పత్రాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు  ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో.. దాసరి నరేందర్ దగ్గర దొరికిన మొత్తం ఆస్తులు విలువ రూ. 7 కోట్ల వరకు ఉంటుందని  అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. నరేందర్ వద్ద ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించామని, ఆయన కేసు నమోదు చేశామని తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఓ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్ గా పని చేసే ఓ ఉద్యోగి దగ్గర కోట్ల రూపాయలు దొరకడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా తరచూ ఏదో  ఒక ప్రాంతంలో అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలనే  జనం డిమాండ్ చేస్తున్నారు.

Show comments