కత్తిపోటు ఎఫెక్ట్.. ఎంపీ, ఎమ్మెల్యేలకు భద్రత పెంపు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాల్లో నువ్వా.. నేనా అనే విధంగా దూసుకుపోతున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాల్లో నువ్వా.. నేనా అనే విధంగా దూసుకుపోతున్నారు.

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తరుపు నుంచి స్వయంగా సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తరుపు నుంచి జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. కొన్ని సమయాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఎటాక్స్ కూడా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీ, దుబ్బాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు భద్రత పెంపు చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి.. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి కీలక నేతలు జంప్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం జరగడంతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టపగలు పోటీ చేస్తున్న అభ్యర్థిపై కత్తితో హత్యాయత్నం జరగడం తీవ్రంగా పరిగణించిన ఇంటెలీజెన్స్ విభాగం ప్రజా ప్రతినిధులకు భద్రతపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న గన్‌మెన్ తో పాటు ఒక్కో ఎంపీకి ఇద్దరు గన్‌మెన్ లను అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 2+2 భద్రతను 4+4 కి పెంచారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రజా ప్రతినిధులకు భద్రత పెంపుపై అన్ని జిల్లాల అధికారులకు ఇంటెలీజెన్స్ డీజీ అనీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 3 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో.. నామినేషన్ల స్వీకరణం జరుగుతుంది. నామినేషన్ల తర్వాత అభ్యర్థులు ప్రచారాల్లో బిజీగా మారిపోతుంటారు. ఆ సమయంలో సెక్యూరిటీ వింగ్ కావాలని కోరితే భద్రత కల్పిస్తామని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ వింగ్ పెంచుతున్నామని అన్నారు. ప్రచారం జరిగే సమయంలో అభ్యర్థులను ఎవరైనా అడ్డుకున్నా, దాడులకు పాల్పపడినా, హత్యాయత్నాలు చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని అన్నారు. జిల్లాలో 971 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ఉంటారని, సమస్యాత్మక ప్రదేశాల్లో ఆర్మీ ఫోర్స్ బందోబస్త్ తో పాటు సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుందని డీజీ అనీల్ కుమార్ తెలిపారు. కాగా, మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న కోట ప్రభాకర్ రెడ్డి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని వస్తుండగా రాజు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పపడ్డాడు. ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి గన్‌మెన్లు అలర్ట్ అయి రాజుని పక్కకు నెట్టివేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో గన్ మెన్ చేతికి కూడా గాయం అయ్యింది. గన్‌మెన్లు ఉండటం వల్లనే ప్రభాకర్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు కాపాడిన గన్‌మెన్లకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యలోనే ప్రజా ప్రతినిధులుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Show comments