P Krishna
ఇటీవల పలువురు రాజకీయ నేతలు రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో ఎవరైనా ప్రమాదాలకు గురైతే వెంటనే స్పందించి స్వయంగా వారిని తమ వాహనంలో కానీ, ఇతర వాహనాల్లో కానీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాని వైద్యులకు సూచిస్తున్నారు.
ఇటీవల పలువురు రాజకీయ నేతలు రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో ఎవరైనా ప్రమాదాలకు గురైతే వెంటనే స్పందించి స్వయంగా వారిని తమ వాహనంలో కానీ, ఇతర వాహనాల్లో కానీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాని వైద్యులకు సూచిస్తున్నారు.
P Krishna
తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అన్ని పార్టీల నేతలు తమ నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎంపీ మాలోతు కవిత ప్రచారం కొనసాగిస్తున్నారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువతి పట్ల తన ఉదారతను చాటుకున్నారు. గతంలో కూడా మాలోతు కవిత పలు సందర్బాల్లో ప్రమాదంలో ఉన్నవారిని కాపాడి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఎంపీ మాలోతు కవిత ప్రచారం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ అధికార పార్టీ చేస్తున్న అభివృద్ది సంక్షేమం గురించి తెలియేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే డోర్నకల్ నియోజవర్గంలో ప్రచారానికి బయలుదేరారు. మార్గ మధ్యలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువతిని గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపి యువతి వద్దకు వెళ్లి పరిస్థితి గమనించి తానే స్వయంగా ఆటో ఎక్కించి దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. వైద్య సిబ్బందికి ఫోన్ చేసి యువతికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో మాలోతు కవిత ఎప్పుడూ ముందు ఉంటారని అంటారు. గతంలో మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన వారిని చూసి వెంటనే తన కాన్వాయిని ఆపి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో బాధితులను జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స విభాగానికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో ఎంత బిజాగా ఉన్నా.. తాజాగా మరోసారి ఆమె తన ఉదారతను చాటుకోవడంతో అన్ని వర్గాల నుంచి ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.