Dharani
Rythu Runa Mafi-Helpline Number: తెలంగాణ ప్రభుత్వం రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేసింది. అయితే కొందరికి ఇంకా రుణమాఫీ కాలేదు. వారి కోసం హెల్ప్‌లైన్ నంబర్ తీసుకొచ్చారు. ఆ వివరాలు..
Rythu Runa Mafi-Helpline Number: తెలంగాణ ప్రభుత్వం రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేసింది. అయితే కొందరికి ఇంకా రుణమాఫీ కాలేదు. వారి కోసం హెల్ప్‌లైన్ నంబర్ తీసుకొచ్చారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వీటిల్లో అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ అమలుకి రేవంత్ సర్కార్ శ్రీకారం చూట్టింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే మొత్తం 2 లక్షల రూపాయల లోపు ఉన్న మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్.. మూడు విడతల్లో మాఫీ చేయడానికి నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు రెండు విడతల్లో సుమారు 18 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు చేసింది. తొలి విడతలో భాగంగా లక్ష రూపాయలు, రెండో విడతలో భాగంగా లక్షన్నర రూపాయలు మాఫీ చేసింది. ఇక ఆగస్టు 15 లోగా 2 లక్షల రూపాయల మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రకటించింది.
అయితే కొద్ది మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అర్హతలు ఉన్నా వారి లోన్ ఖాతాలో నగదు జమ కాలేదు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాకేంతిక సమస్యలు, ఆధార్, రేషన్ కార్డులో పేర్లు సరిపోలకపోవడం తదితర కారణాల వల్ల రుణమాఫీ జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రుణమాఫీ జరగని రైతులు కోసం తాము పోరాడతాం అని బీజేపీ పార్టీ స్పష్టం చేసింది. రుణమాఫీ జరగని రైతుల కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీజేపీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రుణమాఫీ కాని వాళ్లు, ఇతర సమస్యలు ఉన్న రైతులు కూడా 8886100097కునంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చన్నారు. అర్హతలు ఉన్నా రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. కనీసం మూడో విడత నిధులు విడుదల చేసే సమయానికి అయినా వారికి రుణమాఫీ చేయాలని కోరారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం.. రుణమాఫీ కోసం మొదటి విడతలో భాగంగా గత నెల అనగా జూలై 18న లక్ష రూపాయలలోపు లోన్లు తీసుకున్న వారి రుణాలు మాఫీ చేశారు. ఇక జూలై 30న రెండో విడతలో భాగంగా రూ.1.50 లక్షలు ఉన్న వారికి రుణమాఫీ చేశారు. రెండు విడతల్లో కలిపి సుమారు 18 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలో 12 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు జమ చేశారు. ఇక ఆగస్టులో మూడో విడత రుణమాఫీ చేసి.. 2 లక్షల మాఫీ హామీ అమలను పూర్తి చేయనున్నారు.