P Krishna
Good News for Farmers: ప్రభుత్వం రైతుల ఖాతాలకు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఎంతోమంది అన్నదాతతలకు ప్రయోజనం చేకూరనుంది.. మరి మీ ఖాతాలో డబ్బులు వచ్చాయో లేదో చూసుకోండి.
Good News for Farmers: ప్రభుత్వం రైతుల ఖాతాలకు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఎంతోమంది అన్నదాతతలకు ప్రయోజనం చేకూరనుంది.. మరి మీ ఖాతాలో డబ్బులు వచ్చాయో లేదో చూసుకోండి.
P Krishna
తెలంగాణలో గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మహలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ లాంటి పథకాలను ప్రారంభించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేయడానికి ‘ప్రజా పాలన’ దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించారు. ఆగస్టు వరకు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే..
రైతులకు గొప్ప శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. అన్నదాత బ్యాంకు ఖాతాలో డబ్బులు చేమ చేసినట్లు కీలక ప్రకటన చేసింది సర్కార్.ఈ నిర్ణయంతో ఎంతోమంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది.మరి మీ ఖాతాలో డబ్బు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ జూన్ 30 తో ముగిసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 8.99 లక్షల మంది రైతుల నుంచి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాతల బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయాల్సి ఉంది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పటికే 17 వాయిదాలకు రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 18వ విడత డబ్బులు జమచేయాల్సి ఉంది.ఇకపై రైతులు డబ్బును పొందాలంటే ఇకేవైసీ తప్పని సరి పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పీఎం కిసాన్ రైతులు తప్పని సరి కేవైసీ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు. మీ సమీపంలోని ఈ సేవా కేంద్రాల్లో ఈ పని పూర్తి చేస్తారు. మీకు కావాలసిందల్లా ఆధార్ తో లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ ఉండాలి. ఒకవేళ కేవైసీ చేయని అన్నదాతలు వెంటనే ఈ పని పూర్తి చేయండి.