P Venkatesh
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన ఎంఎల్సీ కవితకు మరో షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన ఎంఎల్సీ కవితకు మరో షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.
P Venkatesh
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో బలమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎంఎల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో సెన్సేషన్ గా మారింది. గత నెలలో ఈడీ, ఐటీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి మార్చి 15 న ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం కవితను నేరుగా ఢిల్లీకి తరలించారు ఈడీ అధికారులు. మార్చి 26 వరకు10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత కవిత 14 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. దీంతో అప్పటి వరకు కవిత జైళ్లోనే ఉండనున్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపర్చారు ఈడీ అధికారులు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగించాలని ఈడీ తరపు లాయర్ కోరారు. ఇదే సమయంలో కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది రానా 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని కవిత ప్రభావితం చేసే వ్యక్తి కాదన్నారు.
కోర్టులో కవిత నేరుగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. రెండు నిమిషాలు మాట్లాడేందుకు ఆమెకు సమయం ఇవ్వాలని కోరగా.. అందుకు జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. కోర్టులో మాట్లాడేందుకు పిటిషన్ వేసుకోవాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. ఇక ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టు.. కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు అనగా ఏప్రిల్ 23వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించింది.